OTT Releases This Week (Dec 23-29): ఈ వారం ఓటీటీలో, థియేటర్‌లో సందడే సందడి.. ఇంట్రెస్టింగ్ మూవీస్..!
OTT Releases This Week (Dec 23-29): ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. 2024లో చివరి వీకెండ్ వచ్చేస్తోంది.
OTT Releases This Week (Dec 23-29): ఈ ఏడాది ముగింపు దశకు చేరుకుంది. 2024లో చివరి వీకెండ్ వచ్చేస్తోంది. దీంతో కొత్తేడాదికి వెల్‌కమ్ చెప్పేందుకు అంతా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వారాంతం ప్రేక్షకులను పలకరించేందుకు సినిమాలు/వెబ్‌సిరీస్‌లు సిద్ధమవుతున్నాయి. మరి ఏడాదిలో చివరిలో ప్రేక్షకులను అలరించేందుకు వస్తున్న ఆ ప్రాజెక్ట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన 'బరోజ్ 3డీ' మూవీ ఈ వారాంతం విడుదలకు సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘గార్డియన్ ఆఫ్ డి గామాస్ ట్రెజర్’ నవలని ఆధారం చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు.
* ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోన్న మరో చిత్రం 'శ్రీకాకుళలం షెర్లాక్‌హోమ్స్'. వెన్నెల కిశోర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల, స్నేహ గుప్తా నటించారు. ఈ నెల 25వ తేదీన ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోందీ మూవీ.
* కీర్తి సురేశ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ బేబీ జాన్ 25వ తేదీన ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'తెరి' చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
ఓటీటీలో..
* నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌కు వస్తోన్న ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌లో స్వ్కిడ్ గేమ్ 2 ఒకటి. 2021లో వచ్చిన స్క్విడ్‌గేమ్ వెబ్ సిరీస్‌కు కొనసాగింపుగా ఈ సిరీస్ వస్తోంది. డిసెంబర్ 26వ తేదీ నంఉచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీంతో పాటు ది ఫోర్జ్ (హాలీవుడ్) డిసెంబరు 22, ఓరిజిన్ (హాలీవుడ్) డిసెంబరు 25, భూల్ భూలయ్య3 (హిందీ) డిసెంబరు 27, సార్గవాసల్ (తమిళ) డిసెంబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* అమెజాన్ వేదికగా డిసెంబర్ 27వ తేదీ నుంచి సింగం అగైన్ (హిందీ), థానర (మలయాళం) స్ట్రీమింగ్‌కు రానున్నాయి.
* మరో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన డిస్నీ+హాట్‌స్టార్ వేదికగా వాట్ ఇఫ్..? 3 (యానిమేషన్ సిరీస్) డిసెంబరు 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చేసింది. ఇక డాక్టర్ వూ (హాలీవుడ్ మూవీ) డిసెంబరు 26వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
* జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ఖోజ్ (హిందీ) డిసెంబరు 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
* మనోరమా మ్యాక్స్ వేదికగా పంచాయత్ జెట్టీ (మలయాళ చిత్రం) డిసెంబరు 24వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. అలాగే డిసెంబర్ 25 వ తేదీ నుంచి ఐయామ్ కథలన్ (మలయాళం) అందుబాటులోకి రానుంది.