Rajnikanth:ఆ స్టార్ హీరో భార్యతో రజనీకాంత్ అఫైర్? భార్యకు విడాకులకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట
Rajnikanth: చిత్ర పరిశ్రమలో కొందరి పేర్లు తరతరాలుగా నిలిచిపోతుంటాయి. అలాంటి వారిలో సీనియర్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒకరు. ఆయన కొన్ని దశాబ్దాలుగా వెండితెరపై తనదైన ముద్ర వేస్తున్నారు. బ్లాండ్ అండ్ వైట్ సినిమాల నుంచి ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించారు. ఎంతో కష్టపడి టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి సక్సెస్ ను అందుకున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. బస్ కండక్టర్ నుంచి ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలను ఎదుర్కొవల్సి వచ్చింది. రియల్ లైఫ్ లోనూ కూడా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. అయితే రజనీ కాంత్ పై కూడా లవ్ అఫైర్ వార్తలు వచ్చాయి. అప్పటికే పెళ్లయిన రజనీకాంత్ భార్యకు విడాకులు ఇచ్చి మరో యంగ్ హీరోయిన్ ను పెళ్లి చేసుకుంటాంటూ పలు మ్యాగజైన్లు వార్తలు రాసుకొచ్చాయి.
మనదేశంలో మొదటి పాన్ ఇండియా రజనీకాంత్ అని చెప్పవచ్చే . సౌత్, నార్త్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఆయన సినిమాలు ఓ రేంజ్ లో ఆడాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ కు జోడిగా నటించారు. ముఖ్యంగా 80లో అమలతో మూడు హిట్ సినిమాల్లో నటించారు రజనీకాంత్. ఈ నేపథ్యంలో అమలతో సూపర్ స్టార్ ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
తలైకారన్, కోడిపలాట్టు, మాఫిలై వంటి తమిళ సినిమాల్లో వీరిద్దరూ నటించారు. అప్పటికి రజనీకాంత్ వయస్సు 36ఏళ్లు. అమల వయస్సు 19ఏళ్లు. దీంతో ఆ రోజుల్లో వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవారు ఫ్యాన్స్ . ఈ నేపథ్యంలో వీరిద్దరి మధ్య లేదో నడుస్తుందని..రజనీకాంత్ భార్యకు విడాకులు ఇచ్చి అమలను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలపై రజనీకాంత్ రెస్పాండ్ అవ్వలేదు. అమల మాత్రం క్లారిటీ ఇచ్చేసింది. తనకు రజనీకాంత్ కు మధ్య ఏమీ లేదని..సూపర్ స్టార్ పేరును దెబ్బతీసేందుకు ఇలాంటి ఫేక్ వార్తలు రాయకూడదని స్పష్టం చేసింది. ఆ తర్వాత అమల హీరో నాగార్జునను పెళ్లి చేసుకున్నారు.