Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో వ‌చ్చిన బ్లాక్ బ‌స్టర్ సినిమాలు ఇవే.!

Tollywood Rewind 2024 : మ‌రో 10 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2025 కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలతో మొద‌లు కాబోతుంది.

Update: 2024-12-21 07:26 GMT

Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో వ‌చ్చిన బ్లాక్ బ‌స్టర్ సినిమాలు ఇవే.!

Tollywood Rewind 2024 : మ‌రో 10 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2025 కొత్త సంవత్సరం కొత్త ఆలోచనలతో మొద‌లు కాబోతుంది. ఇక టాలీవుడ్‌కి కూడా వ‌చ్చే ఏడాది మ‌ర‌పురాని సంవత్సరంగా నిలవబోతుంది. ఈ ఏడాది హనుమాన్, క‌ల్కి, పుష్ప 2, దేవ‌ర‌, గుంటూరు కారం సినిమాలు వ‌చ్చి బాక్సాఫీసు వద్ద సందడి చేశాయి. క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాయి. ఇక వ‌చ్చే ఏడాది కూడా రామ్ చరణ్.. గేమ్ ఛేంజ‌ర్‌తో పాటు బాలయ్య డాకు మ‌హారాజ్‌, పవన్ హరిహర వీరమల్లు, ఓజీ త‌దిత‌ర చిత్రాలు రానున్నాయి. అయితే ఈ ఏడాది తెలుగులో వ‌చ్చిన మంచి బ్లాక్ బస్టర్ సినిమాలేంటో చూద్దాం.

ప్రతి సంక్రాంతి మాదిరిగానే టాలీవుడ్ బాక్సాఫీసు వద్ద ఈ సారి పెద్ద సినిమాలు పోటీపడ్డాయి. ఈ ఏడాది సంక్రాంతికి మ‌హేశ్ బాబు ‘గుంటూరు కారం’తో పాటు వెంక‌టేశ్ సైంధవ్, నాగార్జున నా సామి రంగా, ప్ర‌శాంత్ వ‌ర్మ హన్‌మాన్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. గుంటూరు కారం ఫ‌స్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ తెచ్చుకోగా.. సైంధ‌వ్ అయితే ఏకంగా డిజాస్టర్ అయింది. నాగార్జున నా సామి రంగా ఫర్వాలేదు అనిపించింది.. ఎటువంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా వ‌చ్చిన హ‌నుమాన్ ఏకంగా సంక్రాంతి బ్లాక్ బ‌స్టర్ గా నిలిచింది. తేజ స‌జ్జా హీరో చిన్న చిత్రంగా వచ్చిన హనుమాన్ ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద రూ.300 కోట్ల వ‌సూళ్లను రాబట్టింది. డ‌బ్బింగ్ సినిమాలు చూసుకుంటే శివ కార్తికేయ‌న్ అయాల‌న్‌తో పాటు ధ‌నుష్ కెప్టెన్ మిల్లర్ ఫర్వాలేదు అనిపించింది.

ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ నుంచి చిన్న సినిమాలే బాక్సాఫీసును పలకరించాయి. ఇందులో ఒక్క చిత్రం మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ చిత్రమే సందీప్ కిష‌న్ హీరోగా న‌టించిన ఊరుపేరు భైరవకోన. సోషియో ఫాంట‌సీగా వ‌చ్చిన ఈ చిత్రం రూ.50 కోట్ల వ‌రకు కలెక్షన్లను రాబట్టింది. డ‌బ్బింగ్ సినిమాలు చూసుకుంటే ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ డిజాస్టార్‌గా నిలిచింది. మార్చి నెల‌లో కూడా మెగా హీరో వ‌రుణ్ తేజ్ ఆప‌రేష‌న్ వాలంటైన్ అంటూ వ‌చ్చి డిజాస్టర్ సాధించాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ విశ్వక్ సేన్ గామి, శ్రీ విష్టు ఓం భీమ్ బుష్ సినిమాలు యావరేజ్ గా నిలిచాయి. అనంత‌రం వ‌చ్చిన గోపిచంద్ భీమా సైతం ఫ్లాప్ అయింది. డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌గా వ‌చ్చిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

ఏప్రిల్, మే సమ్మర్ సీజన్.. ఈ సీజన్లో తమ సినిమాలను విడుదల చేయాలని చాలా మంది హీరోలు ప్లాన్ చేస్తారు. కానీ ఈ రెండు నెలలలో తెలుగు సినిమా నుంచి ఒక్క హిట్టు కూడా న‌మోదు కాలేదు.. ఏప్రిల్‌లో ఫ్యామిలీ స్టార్ అంటూ విజ‌య్ దేవ‌ర‌కొండ ప్రేక్ష‌కుల ముందుకు రాగా.. డిజాస్టార్‌ను అందుకుంది. ఆ త‌ర్వాత వ‌చ్చిన గీతాంజలి మళ్లీ వచ్చింది, శ్రీరంగ నీతులు చిత్రాలు సైతం అదే బాటలో నిలిచాయి. ఇక మే నెల‌లో వ‌చ్చిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అల్లరి నరేష్ ఆ ఒక్క‌టి అడ‌క్కు, స‌త్య‌దేవ్ కృష్ణ‌మ్మ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బొక్క బోర్లా పడ్డాయి. డ‌బ్బింగ్ చిత్రాల‌లో బాక్ చిత్రం మంచి హిట్ అందుకుంది.

హిట్లు లేక సతమతమవుతున్న టాలీవుడ్ కు క‌ల్కి రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ల‌భించింది. ప్రభాస్ హీరోగా వ‌చ్చిన ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వ‌హించాడు. ఈ చిత్రం మ‌హాభార‌తం & ఫ్యూచ‌ర్‌ కాన్సెప్ట్‌తో వ‌చ్చిన ఈ చిత్రం దాదాపు రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబ‌ట్టింది. శ‌ర్వానంద్ మ‌న‌మే కూడా ఇదే నెల‌లో విడుద‌ల కాగా.. ఫర్వాలేదనిపించుకుంది. డ‌బ్బింగ్ చిత్రాల‌లో త‌మిళం నుంచి మహారాజ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకుంది. జూలై నెల‌లో త‌మిళ సినిమాల హవా నడిచింది.తెలుగు నుంచి ఒక్క పెద్ద సినిమా కూడా విడుద‌ల కాకపోగా.. త‌మిళం నుంచి ఇండియన్ 2తో పాటు ధ‌నుష్ న‌టించిన రాయ‌న్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో రాయ‌న్ మంచి హిట్ కొట్టింది. ఇండియన్ 2 డిజాస్టర్ గా నిలిచింది.

ఇక ఆగ‌ష్టు నెల‌లో కమిటీ కుర్రోళ్లు, ఆయ్ వంటి చిన్న సినిమాలు వ‌చ్చి మంచి హిట్లు అందుకున్నాయి. నాని న‌టించిన స‌రిపోదా శ‌నివారం బాక్సాఫీస్ వ‌ద్ద వందకోట్ల బొమ్మగా నిలిచింది. ఇక త‌మిళం నుంచి విక్ర‌మ్ న‌టించిన తంగలాన్ చిత్రం కూడా వ‌చ్చి మంచి వ‌సూళ్లనే రాబట్టింది. పూరీ జ‌గ‌న్నాథ్ డ‌బుల్ ఇస్మార్ట్‌తో పాటు హారిశ్ శంక‌ర్ ర‌వితేజ కాంబోలో వ‌చ్చిన మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ డిజాస్టర్ అయ్యాయి. అలాగే సెప్టెంబ‌ర్ నెల 35 సినిమాతో ప్రారంభం అయింది. ఆ త‌ర్వాత మ‌త్తు వద‌లరా 2 వ‌చ్చి కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సూప‌ర్ హిట్‌ను న‌మోదు చేసుకుంది. త‌మిళం నుంచి విజ‌య్ న‌టించిన గోట్ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి రూ.400 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.. తెలుగు నుంచి ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర చిత్రం వ‌చ్చి మంచి విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏకంగా రూ.500 కోట్లకు పైగా వ‌సూళ్లను రాబ‌ట్టింది.

అలాగే సినిమాలకు మరో సీజన్ అయిన దసరా మాసం అక్టోబ‌ర్ నెల‌లో క సినిమాతో కెరీర్ లోనే తొలి సూప‌ర్ హిట్ అందుకున్నాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. క త‌ర్వాత ల‌క్కీ భాస్కర్ రూపంలో మ‌రో సూప‌ర్ హిట్ వ‌చ్చింది. న‌వంబ‌ర్ నెల‌లో మ‌ట్కా, కంగువ సినిమాలు ప్రేక్ష‌కుల ముందుకు రాగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఆఖర్లో మూడేళ్లుగా ఊరించిన పుష్ప 2 ది రూల్ వచ్చింది. డిసెంబ‌ర్ 05న ప్రేక్షకుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్టర్ అందుకోవ‌డ‌మే కాకుండా.. 1500కోట్లు కొల్లగొట్టింది.

Tags:    

Similar News