Pallavi Prashanth: రైతు బిడ్డవు కాదు..రాయల్ బిడ్డవంటూ పల్లవి ప్రశాంత్‎ను ఏకిపారేస్తున్న నెటిజన్స్

Update: 2024-12-20 04:28 GMT

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అక్కర్లేని పేరు. మల్లొచ్చినా మీ రైతు బిడ్డను అంటూ డైలాగులతో యూట్యూబ్ తోపాటు ఇన్ స్టాగ్రామ్ సోషల్ మీడియాలో మంచి సింపతిని సంపాదించుకున్నాడు. అదే సింపతితో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసందే. రైతు బిడ్డ అనే ట్యాగ్ తో కామన్ మ్యాన్ కేటగిరీలో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ ఆఖరి వరకు రైతు బిడ్డ అనే పదాన్ని ఉపయోగించాడు. దీంతో టైటిల్ ను ఎగరేసుకుపోయాడు. హౌస్ లో ఉన్నంత వరకు అమాయకమైన మాట తీరుతో టైటిల్ గెలిచి వచ్చిన ప్రైజ్ మనీతో రైతులకు సహాయం చేస్తానని చెప్పిన కళ్లిబుల్లి మాటలు ప్రేక్షకులు కూడా బాగానే నమ్మేశారు.

హౌస్ లో ఉన్నప్పుడు డబ్బులు గెలిస్తే రైతులకు పంచి పెడతానంటూ మంచి చేస్తానంటూ మంచి మంచి మాటలు చెప్పిన పల్లవి ప్రశాంత్ బయటకు రాగానే పూర్తిగా మాటలు మార్చేసినట్లు తెలుస్తోంది. ఏదో ఒకరిద్దిరికీ సహాయం చేశాడు. భారీగా ట్రోల్స్ రావడంతో ఓ పేద కుటుంబానికి లక్ష రూపాయల సహాయం చేశాడు. ఆ తర్వాత ఇచ్చిన మాట గురించి రైతుల సహాయం గురించి మర్చిపోయాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పై భారీగా ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడంతో పల్లవిప్రశాంత్ వాకింగ్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ కూడా మారిపోయాయి. రైతు బిడ్డగా ఉన్న పల్లవి ప్రశాంత్ కాస్త రాయల్ బిడ్డగా మారాడంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలే దీనికి నిదర్శనం.

అందులో ప్రశాంత్ లుక్ చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. కలర్ ఫుల్ డ్రెస్సులో చాలా స్టైలిష్ గా కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ సోకులకేం తక్కువ కాదు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు డబ్బులు పంచు అంటూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. లుక్ మార్చేశావేంటన్నా..రైతు బిడ్డ కాస్త రాయల్ బిడ్డ అయ్యాడంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ బిల్డప్ చూడలేకపోతున్నాం రా బాబు అంటూ మరికొంత మంది ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ మధ్య అల్లు అర్జున్ వ్యవహారంలోనూ రైతు బిడ్డ షేర్ చేసిన పోస్ట్ మిస్ ఫైర్ అవ్వడంతో బన్నీ ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఏకిపారేశారు. అయినా కూడా పల్లవి ప్రశాంత్ లో ఏమాత్రం మార్పు లేదు. 

Tags:    

Similar News