Vijay Devarakonda: డేటింగ్ వార్తలపై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

Vijay Deverakonda: సమయం వచ్చినప్పుడు డేటింగ్ (Dating) రూమర్స్ పై అన్ని విషయాలను బయటపెడతానని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)చెప్పారు.

Update: 2024-12-19 07:10 GMT

Vijay Devarakonda: డేటింగ్ వార్తలపై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే?

Vijay Deverakonda: సమయం వచ్చినప్పుడు డేటింగ్ (Dating) రూమర్స్ పై అన్ని విషయాలను బయటపెడతానని విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన పంచుకున్నారు. అందరితో పెంచుకోవాలనుకున్నప్పుడు దాని గురించి తప్పకుండా మాట్లాడుతానని ఆయన చెప్పారు. దీనికి ఓ ప్రత్యేక సమయం, కారణం ఉండాలని ఆయన అన్నారు. అలాంటి రోజున సంతోషంగా తన వ్యక్తిగత జీవితం గురించి అందరికి చెబుతానని ఆయన తెలిపారు.

పబ్లిక్ ఫిగర్ గా ఉన్న తన గురించి తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతారని.. దీన్ని తాను ఒత్తిడిగా భావించనని చెప్పారు.ఎవరైనా ఒక వ్యక్తిని అమితంగా ప్రేమిస్తే.. బాధను కూడా మోయాల్సి ఉంటుందని చెప్పుకొచ్చారు.ఇక సినిమాల విషయానికొస్తే.. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్‌తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. ఆ తర్వాత కల్కి 2898 ఏడీలో (Kalki 2898 AD)అర్జునుడిగా అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 కోసం వర్క్ చేస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి(Gowtam Tinnanuri) దర్శకత్వంలో ఇది తెరకెక్కుతోంది. సితార (Sithara Entertainments)ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ (Naga Vamsi)దీనిని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది.

Tags:    

Similar News