Prabhas Raja Saab Postponed: ప్రభాస్ రాజా సాబ్ వాయిదా?
రెండు రోజుల క్రితం ప్రభాస్‌కు ఈ మూవీ షూటింగ్‌లో కాలు బెణికిందని న్యూస్ వచ్చింది. దీంతో ప్రభాస్ సర్జరీ కోసం ఇటలీ వెళ్తున్నాడని.. మళ్లీ జనవరి చివరిలో ఇండియాకు తిరిగి వస్తాయని సమాచారం.
ప్రభాస్(Prabhas ) నటిస్తున్న రాజా సాబ్(Raja Saab) వాయిదా పడినట్టు తెలుస్తోంది. మారుతి (Maruthi) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ కావాలి. కానీ గత కొన్ని రోజుల నుంచి వాయిదా అని రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అధికారికంగా చెప్పకపోయినప్పటికీ దాదాపు వాయిదా పడ్డట్టే అని ప్రచారం జరుగుతుంది.
రెండు రోజుల క్రితం ప్రభాస్‌కు ఈ మూవీ షూటింగ్‌లో కాలు బెణికిందని న్యూస్ వచ్చింది. దీంతో ప్రభాస్ సర్జరీ కోసం ఇటలీ వెళ్తున్నాడని.. మళ్లీ జనవరి చివరిలో ఇండియాకు తిరిగి వస్తాయని సమాచారం. కాబట్టి అప్పటివరకు రాజా సాబ్ షూటింగ్ జరగదు. దీంతో సినిమా ఏప్రిల్ 10కి రిలీజ్ కాదని అర్థమవుతుంది.
ప్రభాస్ నటిస్తోన్న రాజాసాబ్‌ను 2025 ఏప్రిల్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించగా.. రిలీజ్ వాయిదా పడుతుందంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జాక్(Jack) సినిమాను ఇదే తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటిస్తూ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda)నటిస్తున్న ప్రాజెక్టు జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీ విడుదల తేదీపై మేకర్స్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. బేబి వైష్ణవి చైతన్య (Baby Vaishnavi chaitanya) హీరోయిన్. షూటింగ్ చివరి దశలో ఉంది. ఇప్పుడు హఠాత్తుగా ఏప్రిల్ 10న థియేటర్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో రాజా సాబ్ సినిమా వాయిదా గురించి వీళ్లకు క్లారిటీ ఉందని.. అందుకే అంత కచ్చితంగా అప్ డేట్ వేశారు అని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైతేనేం రాజా సాబ్ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఇది నిరాశ పరిచే వార్త అని చెప్పాలి.