Manchu Nirmala: మనోజ్ ఆరోపణల్లో నిజం లేదు.. పోలీసులకు మోహన్ బాబు భార్య లేఖ
Manchu Nirmala: మంచు కుటుంబంలో గొడవలపై మంచు మోహన్ బాబు భార్య మంచు నిర్మల స్పందించారు.
Manchu Nirmala: మంచు కుటుంబంలో గొడవలపై మంచు మోహన్ బాబు భార్య మంచు నిర్మల స్పందించారు. పహాడీ షరీఫ్ పోలీసులకు మంగళవారం లేఖ రాశారు. తన పుట్టినరోజు డిసెంబర్ 14న విష్ణు గొడవ చేశారని మంచు మనోజ్(Manchu Manoj) ఆరోపణలు చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై ఆమె ఆ రోజు ఏం జరిగిందో ఆ లేఖలో వివరించారు.
విష్ణు గొడవ చేయలేదు: నిర్మల
తన పుట్టిన రోజున జల్ పల్లిలోని తన ఇంటికి విష్ణు కేక్ తీసుకు వచ్చి సెలబ్రేట్ చేశారని ఆమె చెప్పారు. దీనిపై మంచు మనోజ్ విష్ణు(Manchu Vishnu)పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె అన్నారు. ఆ రోజు ఇంట్లో ఎలాంటి గొడవ జరగలేదని ఆమె తెలిపారు. మనోజ్ కారణంగానే ఇంట్లో పనిచేస్తున్నవారు మానేశారని ఆమె ఆ లేఖలో తెలిపారు.
తన తల్లి పుట్టిన రోజన విష్ణు తన మనుషులతో వచ్చి గొడవ చేశారని మంచు మనోజ్ డిసెంబర్ 15న ఆరోపించారు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. తన ఇంట్లో ఉన్న జనరేటర్ లో పంచదార పోయించి విద్యుత్ సరఫరా నిలిపివేశారని ఆయన ఆరోపణలు చేశారు. తన కోచ్ ను కూడా బెదిరించారని చెప్పారు.