Rashmika Mandanna: జీవిత భాగస్వామిపై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు
జీవితంలోని ప్రతి దశలో తనకు తోడుగా ఉండాలని.. అన్ని వేళలా భద్రతను ఇవ్వాలని కష్ట సమయంలో తనకు సపోర్ట్‌గా ఉండేవారు తనకు భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
రష్మిక మందన్న(Rashmika Mandanna) కెరీర్ స్టార్ట్ చేసిన కొద్దిరోజులకే పాన్ ఇండియా హీరోయిన్ అయ్యారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. తాజాగా పుష్ప2 ఘన విజయం సాధించడంతో ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రష్మిక జీవితానికొస్తే.. ప్రేమ, రిలేషన్ షిప్ పై చాలాకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హీరో విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా సక్సెస్‌లో భాగంగా పలు నేషనల్ మీడియాలకు తాను ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తన జీవిత భాగస్వామి ఎలా ఉండాలో చెప్పారు. జీవితంలోని ప్రతి దశలో తనకు తోడుగా ఉండాలని.. అన్ని వేళలా భద్రతను ఇవ్వాలని కష్ట సమయంలో తనకు సపోర్ట్‌గా ఉండేవారు తనకు భాగస్వామిగా రావాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు.
ఒకరిపై మరొకరు బాధ్యతగా ఉంటే జీవితాంతం కలిసి ఉండవచ్చని తెలిపారు. తన దృష్టిలో ప్రేమ అంటే జీవిత భాగస్వామిని కలిగి ఉండటమేనని చెప్పారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ తోడు కావాలని తోడు లేకపోతే జీవితానికి ప్రయోజనం ఉండదని చెప్పారు. ఇక సినిమాల విషయానికొస్తే.. రష్మిక తెలుగులో కుబేర సహా హిందీలో సికందర్ అనే పలు భారీ సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప2కి సీక్వెల్‌గా పుష్ప3 కూడా రానుంది. మరి అందులో తన రోల్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి మరి.