Sobhita Dhulipala: చైతూతో స్నేహం నుంచి ప్రేమాయణం అలా మొదలైంది..శోభిత తాజా ఇంటర్వ్యూ
Sobhita Dhulipala: అక్కినేని నాగాచైతన్య, శోభిత దూళిపాళ్ల డిసెంబర్ 4వ తేదీ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్త జంట ఓ జాతీయ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. అందులో వీరిద్దరి పరిచయం, ప్రేమ గురించి చాలా విషయాలను పంచుకున్నారు. మొదటిసారి 2018లో నాగార్జున ఇంటికి వెళ్లినట్లు శోభిత చెప్పారు. 2022 ఏప్రిల్ తర్వాత చైతుతో తన స్నేహం మొదలైనట్లు చెప్పుకొచ్చారు శోభిత.
2022 నుంచి నాగచైతన్యను ఇన్ స్టాలో ఫాలో అవుతున్నట్లు తెలిపారు. తనకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని..నేను చైతూ కలిసినప్పుడు ఫుడ్ గురించి మా అభిప్రాయాలను పంచుకునేవాళ్లమని తెలిపారు. తెలుగులో మాట్లాడమని చైతన్య తనను తరుచూ అడిగేవారని తెలిపారు. అలా మాట్లాడటం వల్ల మా బంధం మరింత బలపడిందని చెప్పారు శోభిత.
తానెప్పుడూ ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉంటానని..తాను షేర్ చేసే గ్లామర్ ఫొటోలు కాకుండా మోటివేషనల్ స్టోరీలు, నా అభిప్రాయాలకు సంబంధించిన పోస్టులను నాగచైతన్య లైక్ చేసేవారని శోభిత చెప్పుకొచ్చారు. అయితై చైతన్యను మొదటిసారి ముంబైలోని ఓ కేప్ లో కలిసినట్లు చెప్పారు. అప్పుడు చైతన్య హైదరాబాద్..నేను ముంబైలో ఉండేవాళ్లమని..తన కోసం హైదరాబాద్ నుంచి ముంబైకి వచ్చేవారని చెప్పారు. మొదటిసారి తామిద్దరం బయటకు వెళ్లినప్పుడు నేను రెడ్ డ్రెస్, చైతన్య బ్లూ సూట్ లో ఉన్నారని చెప్పారు. ఆ తర్వాత కర్నాటకలోని ఓ పార్కుకు వెళ్లాము.. అక్కడ కొంత సమయం గడిపిన తర్వాత ఒకరికొకరం గోరింటాకు పెట్టుకున్నాము..తర్వాత అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ కు వెళ్లామని అప్పటి నుంచి జరిగిన విషయమంతా అందరికీ తెలిసిందే అంటూ శోభిత గుర్తు చేసుకున్నారు.
చైతు ఫ్యామిలీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు తనను ఆహ్వానించినట్లు శోభిత తెలిపారు. ఆ మరుసటి ఏడాది చైతన్య తన కుటుంబాన్ని కలిసారని చెప్పారు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే ఈ ఏడాది గోవాలో పెళ్లి ప్రాతిపాదన తీసుకువచ్చినట్లు చెప్పుకొచ్చారు.