Megastar Chiranjeevi: యంగ్ హీరోలకు ధీటుగా చిరంజీవి.. వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయస్సులో యంగ్ హీరోలకు ధీటుగా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.
Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 69 ఏళ్ల వయస్సులో యంగ్ హీరోలకు ధీటుగా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. బాలయ్య, వెంకటేష్‌లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్టు చేయడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర(Vishwambhara) చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వయలెన్స్ చిత్రం చేస్తున్నారు. నాని సమర్పణలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు ఓకే చెప్పినట్టు సమాచారం. అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో నటించడానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అనిల్ రావిపూడి ఇప్పటికే బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చారు. మరోవైపు వెంకటేష్‌తో ఎఫ్2, ఎఫ్3 వంటి సక్సెస్‌లను అందుకున్నారు. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను వెంకటేశ్ తో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత చిరంజీవి(Chiranjeevi)తో అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే చిరంజీవి కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ మూవీని భగవంత్ కేసరి సినిమాను నిర్మించిన సాహూ గారపాటి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఇక చిరంజీవి ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరి 10న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనూహ్యంగా గేమ్ ఛేంజర్(Game Changer) రాకతో ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే యేడాది మే 9న విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నట్టు సమాచారం.