Samantha And Shobhita: సమంత, శోభిత..వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ ఆస్తి ఉందో తెలిస్తే..ఆశ్చర్యపోవడం ఖాయం

Update: 2024-12-18 13:15 GMT

Samantha And Shobhita: అక్కినేని నాగచైతన్య..ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన నటించిన సినిమాల గురించి కాకుండా ఆయన వ్యక్తిగత జీవితం గురించే వార్తలు వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య..హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏంమాయచేసావే సినిమాతో వీరిద్దరి ప్రేమలో పడ్డారు. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెద్దలను ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి సంసారం సాఫీగా సాగిపోయింది. టాలీవుడ్ స్టార్ కపుల్ క్రేజ్ ను ఈ జంట తెచ్చుకుంది. అయితే ఎవరూ ఊహించని విధంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించారు. 2022లో ఇద్దరు కూడా విడిపోతున్నట్లు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం ఇన్ స్టాగ్రామ్ లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత ఈ జంట గురించి ఎన్నో వార్తలు బయటకు వచ్చాయి.

అయితే సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య సినిమాల్లో బిజీగా ఉన్నారు. సమంత కూడా తాను వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత అనారోగ్య సమస్యల బారిన పడిన సమంత చికిత్స తీసుకుంటూ నెమ్మదిగా కోలుకుంది. ఇక నాగచైతన్య నటి శోభిత దూళిపాళ్లను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈమధ్యే వీరి వివాహం జరిగింది.

అయితే సమంత, శోభిత వీరిద్దరిలో ఎవరికి ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమంత దాదాపు 15ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నారు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పుడు సమంత ఆస్తుల విలువ 101కోట్ల వరకు ఉంటాయట. సినిమాలే కాదు సమంత పలు యాడ్స్ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తున్నారు. వీటితోపాటు సఖీ అనే క్లాతింగ్ బ్రాండ్, ఏం స్కూల్ కూడా రన్ చేస్తున్నారు.ఇక శోభిత ధూళిపాళ్ల 8ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. శోభిత ఆస్తుల విలువ దాదాపు 7 నుంచి 10కోట్ల వరకు ఉంటుందని సమాచారం. అయితే ఇప్పుడు నాగచైతన్య ఆస్తులతో కలిపితే 154కోట్ల ఉంటాయట. 

Tags:    

Similar News