Rajamouli: రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
Rajamouli: ఎస్. ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అసలు రాజమౌళి గురించి మాట్లాడాలంటే మనకున్న వొకాబులరి సరిపోదనే చెప్పవచ్చు. ఒకప్పుడు తెలుగు సినిమాలను చిన్నచూపు చూసిన ఇండస్ట్రీలతోనే శభాష్ అనిపించేలా చేసిన సత్తా రాజమౌళిదే.
తెలుగువాళ్లను బాలీవుడు ఎప్పుడు అవమానించేంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ ఈవెంట్లో ఎమోషనల్ అయ్యారంటే ఎంతగా అవమానాలు ఎదుర్కొన్నారో అర్థం చేసుకోవాలి. అలాంటి 10ఏళ్ల తర్వాత అదే బాలీవుడ్ ఇండస్ట్రీ తెలుగు సినిమాకు పట్టం కట్టేలా చేశారు రాజమౌళి. ఒకప్పుడు రాజమౌళి అంటే పేరు మాత్రమే. కానీ ఇప్పుడు ఆయనొక బ్రాండ్. అయితే సినిమాలు ఏవైనా సరే హీరోపై ఆధారపడి ఉంటాయి. రాజమౌళి తీసే సినిమాలకు మాత్రం ఆయన పేరుతోనే బిజినెస్ జరుగుతుంది. పోస్టర్ పై రాజమౌళి పేరు కనిపిస్తే చాలు..హీరో ఎవరో అని కూడా ఆలోచించకుండా సినిమా చూసేందుకు పరుగులు తీస్తుంటారు.
ఇంత క్రేజ్ ఉన్న రాజమౌళి సినిమాలో కేవలం పది నిమిషాలు కనిపించినా చాలు అనుకునే నటులు ఎందరో ఉన్నారు. బాహుబాలి శిమగామి పాత్ర ఇస్తే.. ఒక హీరోయిన్ తిరస్కరించిందట. ఎందుకంటే తాను అడిగిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. ఆ స్టార్ హీరోయిన్ ఎవరంటే శ్రీదేవి. రమ్యక్రిష్ణ కంటే ముందు శ్రీదేవిని అనుకున్నారట రాజమౌళి. ముంబైకి వెళ్లి శ్రీదేవికి కథ వినిపించారట.కానీ శ్రీదేవి మాత్రం కథ నచ్చింది కానీ రెమ్యూనరేషన్ గా 10 కోట్లు అడిగారట. ఫ్లైట్, హోటల్ ఛార్జీలు మొత్తం కలుపుకుంటే 15కోట్లు అవుతుంది. దాంతో మూవీ మేకర్స్ వెనకడుగు వేశారట.
ఆ పాత్ర కోసం రమ్యక్రిష్ణను తీసుకున్నాడట రాజమౌళి. ఓ ఇంటర్య్వూలో రమ్యక్రిష్ణ శివగామి రోల్లో చూసిన తర్వాత శ్రీదేవి ఈ పాత్రకు ఒప్పుకోకపోవడమే మంచిదైందని చెప్పారు. శ్రీదేవి కూడా ఓ ఇంటర్వ్యూలో దీని గురించి మాట్లాడింది. రెమ్యూనరేషన్ గురించి కాదని..అందులో నిజం లేదన్నారు.