Prabhas Sorry to Japan fans:జపాన్ భాషలో అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృ‌ష్టించిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)చిత్రం.. జపాన్‌(Japan)లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది

Update: 2024-12-18 14:51 GMT

Prabhas Sorry to Japan fans:జపాన్ భాషలో అభిమానులకు సారీ చెప్పిన ప్రభాస్

ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృ‌ష్టించిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)చిత్రం.. జపాన్‌(Japan)లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు ప్రభాస్(Prabhas). తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పారు.

కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని.. త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్ కు చెప్పారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని అన్నారు. అయితే ప్రభాస్ కల్కిని ఎంజాయ్ చేయండంటూ జపనీస్‌లో మాట్లాడడం విశేషం.



ఇక మారుతి(Maruti) డైరెక్ట్‌ చేస్తున్న రాజా సాబ్‌ (raja saab)) సినిమా షూటింగ్‌లో ఇటీవల ప్రభాస్ కాలుకు గాయమైంది. దీంతో ప్రభాస్ సర్జరీ కోసం ఇటలీ(Italy) వెళ్తున్నాడని.. మళ్లీ జనవరి చివరిలో ఇండియాకు తిరిగి వస్తాయని సమాచారం. ఇక షూటింగ్ నిలిచిపోవడంతో ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సిన సినిమా.. వాయిదా పడిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News