Pushpa 2: 'అస్సలు తగ్గేదేలే'.. 100 ఏళ్ల బాలీవుడ్ చరిత్రలో పుష్ప2 అరుదైన రికార్డ్..!
పుష్ప2 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప2 నిలిచింది.
Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 సినిమా జైత్రయాత్ర కొనసాగుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల భాషతో సంబంధం లేకుండా పుష్ప2 చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్‌తో వండర్స్ క్రియేట్ చేసిన పుష్ప2, విడుదల తర్వాత కూడా ప్రభంజనాన్ని సృష్టించింది.
ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన విషయం తెలిసిందే. విడుదలైన కేలం 6 రోజుల్లోనే ఏకంగా రూ. 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసి భారతీయ సినిమా ఇండస్ట్రీలో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాగా ప్రస్తుతం మరే పెద్ద సినిమా విడుదలకు సిద్ధంగా లేకపోవడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి2 వసూళ్లను (రూ. 1810 కోట్లు) దాటడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా పుష్ప2 మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. హిందీ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పుష్ప2 నిలిచింది. ఈ సినిమా ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఏకంగా రూ. 632 కోట్లు రాబట్టింది. 100 ఏళ్ల బాలీవుడ్‌లో చరిత్రలో ఇదొక అరుదైన రికార్డుగా సిని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఇదంతా కేవలం 15 రోజుల్లోనే కావడం విశేషం. ఇదిలా ఉంటే పుష్ప2 కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రూ. 2 వేల కోట్ల మార్కును పుష్ప2 టచ్ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
కాగా పుష్ప2లో మరిన్ని సన్నివేశాలు యాడ్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్టపికే ఈ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాలు ఉండగా మరో 20 నిమిషాల నిడివి ఉన్న సీన్స్‌ను యాడ్ చేసే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దీంతో రిపీట్ ఆడియన్స్ పెరిగే అవకాశాలు ఉన్నట్లు చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. మరి పుష్ప2 బాక్సాఫీస్ వద్ద మరెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.