Allu Arjun Press Meet: రాత్రికి రాత్రే నా 20 ఏళ్ల కెరీర్, ఇమేజ్ డ్యామేజ్ చేస్తానంటే ఎలా? నా క్యారెక్టర్ గురించి కామెంట్స్ చేస్తారా?

Allu Arjun comments on Telangana CM Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అల్లు అర్జున్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వైరల్ అవుతున్న నేపథ్యంలో తాజాగా అల్లు అర్జున్ కూడా మీడియా ద్వారా తన అభిప్రాయాలను తెలియజేస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

Update: 2024-12-21 15:13 GMT

Allu Arjun's reaction to Revanth Reddy's comments on Sandhya theatre stampede incident: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. సంధ్య థియేటర్ వద్ద రద్దీ పెరుగుతోందని పోలీసులు చెబితేనే తాను థియేటర్ నుండి వెళ్లిపోయానన్నారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారని, ఆమె కొడుకు శ్రీతేజ్ గాయపడ్డారని మరుసటి రోజు వరకు తనకు తెలియదు అని అల్లు అర్జున్ అన్నారు.

తాను పోలీసులతో ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని, అభిమాని చనిపోయినట్లు చెప్పిన తరువాత కూడా తాను రోడ్ షో చేసుకుంటూ వెళ్లిపోయానని వస్తోన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. అదంతా కూడా కేవలం మిస్‌కమ్యునికేషన్ వల్ల జరుగుతున్న పరిణామాలేనని అభిప్రాయపడ్డారు. తన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా వస్తోన్న ఆరోపణలు వింటుంటే బాధనిపిస్తోందని చెప్పారు.

తెలుగు వారు గర్వించేలా సినిమాలు చేయాలనేదే తన లక్ష్యమని, కానీ దేశం అంతా చూస్తుండగా తెలుగు వారే తనని కిందకు లాగేలా మాట్లాడటం చాలా ఆవేదనకు గురిచేసిందని అన్నారు. అభిమానుల కోసం ఎంత దూరం వెళ్లడానికైనా సిద్ధంగా ఉండే మనిషిననని, కానీ అదే అభిమాని కుటుంబాన్ని పట్టించుకోలేదని అనడం కరెక్ట్ కాదని వివరణ ఇచ్చారు. తన వ్యక్తిత్వాన్ని తప్పుపట్టేలా వస్తోన్న ఆరోపణలన్నీ 100 శాతం తప్పుడు ఆరోపణలేనని అల్లు అర్జున్ బదులిచ్చారు (Allu Arjun about allegations on his character assassination).

Full View

20 ఏళ్ల నుండి సినిమాలు చేసుకుంటూ, అభిమానులను గౌరవిస్తూ వెళ్తున్న తనపై తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా తప్పుడు ఆరోపణలు ఎలా చేస్తారని అల్లు అర్జున్ ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలతో రాత్రికి రాత్రే తన 20 ఏళ్ల కెరీర్, ఇమేజ్ డ్యామేజ్ చేస్తానంటే ఎలా అని తన ఆవేదనను వెలిబుచ్చారు. తన క్యారెక్టర్ గురించి వస్తోన్న కామెంట్స్ వింటుంటే తట్టుకోలేకపోతున్నానని అల్లు అర్జున్ (Allu Arjun press meet over Reanth Reddy allegations) చెప్పుకొచ్చారు. తాను ఏ నాయకుడిని తప్పుపట్టడం లేదు, ఎవ్వరినీ తప్పు పట్టడం లేదంటూనే తన గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన అన్ని ఆరోపణలకు వివరణ ఇస్తూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

Tags:    

Similar News