Devara: దేవర మూవీని మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె తప్పుకోవడంతో..
Devara: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Devara: ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఏడాది బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఎన్టీఆర్ అద్భుత నటన, కొరటాల మార్క్ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీకపూర్ నటించింది. జాన్వీ తొలి తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో పెద్దగా నటను ప్రాధాన్యత లేకపోయినప్పటికీ తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ముఖ్యంగా చుట్టమల్లే చుట్టేసింది పాటతో మెస్మరైజ్ చేసింది. ఈ పాటలో జాన్వీని చూసిన కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే దేవర మూవీలో హీరోయిన్‌గా తొలి ఆప్షన్ జాన్వీ కాదని మీలో ఎంత మందికి తెలుసు?
అవును తొలుత జాన్వీ స్థానంలో మరో హీరోయిన్‌ను అనుకున్నారంటా. అయితే చివరి క్షణంలో ఈ అవకాశం జాన్వీని వరించిందని సమాచారం. నిజానికి కొరటాల శివ తొలుత ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్ రష్మికను అనుకున్నారంటా. అయితే అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. దేవర చిత్రానికి డేస్ట్ అడ్జెస్ట్ చేయలేకపోయింది. దీంతో రష్మిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. దేవర చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించిన కారణంగానే రష్మికను తీసుకోవాలని ప్లాన్ చేశారంటా.
అయితే ఆమె తప్పుకోవడంతో అదే పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న జాన్వీ కపూర్‌ను ప్రాజెక్ట్‌లోకి తీసుకున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అటు రష్మిక కానీ, దేవర మూవీ యూనిట్ కానీ అధికారికంగా స్పందించలేదు. ఇదిలా ఉంటే ఈ ఏడాది జాన్వీ దేవరతో మంచి విజయాన్ని అందుకుంటే. రష్మిక.. పుష్ప2 చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పుష్ప2లో తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసీందీ బ్యూటీ. ఇలా ఈ ఇద్దరు బ్యూటీలు ఈ ఏడాది తమ ఖాతాల్లో మంచి విజయాలను వేసుకున్నారు.