Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి ఆ సినిమానే కారణమట?

Update: 2024-12-18 14:20 GMT

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి...ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది సెలబ్రిటీల్లో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న అనంతరం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు మెగాస్టార్. రాజకీయాల్లోకి వచ్చిన సెలబ్రిటీలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఈ క్రమంలో వారందర్నీ స్పూర్తిగా తీసుకుని మెగాస్టార్ కూడా రాజకీయాల్లోకి వచ్చారు.

సినిమాలు తీస్తూనే ఆయన ప్రజారాజ్యం పార్టీని పెట్టారు ఇలా ఆ పార్టీ స్థాపించిన చిరంజీవి ఎన్నికల్లో పోటీ చేశారు. అనుకున్న స్థాయిలో మెజార్టీ దక్కలేదు. దీంతో కొన్ని రోజులకే కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి కేంద్రమంత్రి బాధ్యతలు తీసుకున్నారు. కొంతకాలం పాటు రాజకీయాల్లో కొనసాగిన చిరంజీవి తనకు రాజకీయాలు అంత సెట్ అవ్వవు అని తెలిసి తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేశారు.

అయితే చిరంజీవి రాజకీయాల్లో రావడానికి వెనకున్న అసలు నిజం తెలిస్తే షాక్ అవుతాం. ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చేలా చేసింది ఓ సినిమా అట. ఆ సినిమా ఏంటంటే ముఠామేస్త్రీ. కోదండరామిరెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ముఠామేస్త్రీ మూవీ మార్కెట్లో కూలీగా పనిచేస్తూ ఏకంగా చిరంజీవి మంత్రిస్థాయికి ఎదుగాడు. ముఠామేస్త్రీ సినిమా ప్రభావం వల్లే చిరుకి సీఎం అవ్వాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు.

ఈయన అనుకున్న విధంగానే పార్టీ పెట్టడం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది కానీ సినిమాల్లో మంత్రి అయినంత సులువుగా నిజజీవితంలో కాలేమనే సత్యాన్ని గ్రహించారు. దీంతో తన పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన చిరంజీవి తిరిగి సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక త్వరలోనే ఈయన విశ్వంభర అనే మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. 

Tags:    

Similar News