Keerthy Suresh Viral Pics: పెళ్లైన వారానికి ఈవెంట్‌కు.. పసుపుతాడుతో ప్రమోషన్స్‌లో పాల్గొన్న కీర్తి సురేష్ ఫోటోలు వైరల్
Keerthy Suresh Knot Photos Goes Viral: పెళ్లయి వారం కూడా కాకముందే సినీ నటి కీర్తీ సురేష్ (Keerthi suresh) అప్పుడే తన సినిమా ప్రమోషన్స్‌తో బిజీ అయింది. మోడ్రన్ డ్రస్‌లో, మెడలో పసుపుతాడుతో ఈ వేడుకలో కీర్తి సురేష్ ఎంట్రీ ఇచ్చిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాహ బంధంపై ఎనలేని గౌరవంతో తాళిని అలాగే ఉంచుకుని కీర్తి సురేష్ ఈవెంట్‌కు రావడం అందర్ని ఆకర్షించింది.
నటి కీర్తి సురేష్ పెళ్లి తన స్నేహితుడు ఆంటోనీతో గోవాలో గ్రాండ్‌గా జరిగింది. డిసెంబర్ 12న ఆంటోనీతో కలిసి ఏడడుగులు వేసింది. తన 15 ఏళ్ల ప్రేమను పరిచయం చేస్తూ మహానటి కీర్తి సురేష్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. కాలేజ్ డేస్ నుంచి ఆంటోనిని ప్రేమించిన కీర్ సురేష్ తన ప్రేమను పెళ్లిగా మార్చుకుంది.
పెళ్లికి సంబంధించిన పనులన్నీ కీర్తి సురేష్ దగ్గరుండి చూసుకున్నారు. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న కీర్తి.. ఆ తర్వాత తన భర్త ఆంటోని క్రిస్టియన్ అయినందున క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం మ్యారేజ్ చేసుకుంది. ఈ సందర్భంగా భర్తకు లిప్‌లాక్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక పెళ్లి తతంగం ముగియగానే కీర్తి సురేష్ తిరిగి తన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ ఏడాది బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి బేబి జాన్ అనే సినిమాలో నటించింది. పెళ్లికి ముందే షూటింగ్ పూర్తి చేసిన కీర్తి.. పెళ్లి తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంది. ముంబైలో జరిగిన ప్రమోషన్స్ ఈవెంట్‌కు అటెండ్ అయింది.
ఇక బేబి జాన్ (Baby john) సినిమాలో వామికా గబ్బి, జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో నటించారు. కలీస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించారు. డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కీర్తికి బాలీవుడ్‌లో ఇదే తొలి సినిమా కావడం విశేషం.