SS Rajamouli, Mahesh Babu: 100 ఎకరాల్లో వంద కోట్లతో భారీ అడవి సెట్‌.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసమేనా?

Update: 2024-12-19 16:30 GMT

SS Rajamouli's forest plans in 100 acres with 100 crores for Mahesh Babu next movie: బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాల తరువాత రాజమౌళి నుండి నెక్ట్స్ వచ్చే సినిమాలు ఏకంగా హాలీవుడ్ రేంజ్‌లో ఉంటాయని ఆల్రెడీ అంతా ఫిక్స్ అయ్యారు. ఇక మహేష్ బాబుతో ఆయన తీయబోయే సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం 100 ఎకరాల్లో వంద కోట్ల ఖర్చుతో అడవి సెట్‌తో రాజమౌళి ట్రెండ్ సెట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అదేంటో తెలుసుకుందాం.

మహేష్ బాబు సినిమా కోసం వంద కోట్లు ఖర్చు పెట్టి వంద ఎకరాల్లో ప్లాస్టిక్ అడవినే క్రియేట్ చేయబోతున్నాడు రాజమౌళి. వంద కోట్ల బడ్జెట్‌ని కేవలం మహేష్ బాబు సినిమాలో ఒక 20 నిమిషాల ఎపిసోడ్ కోసమే వాడబోతున్నాడు. అది కూడా కేవలం ఓ యాక్షన్ ఎపిసోడ్ కోసం వేసే సెట్ అని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ సినిమాలో విలన్ ఎవరనే చర్చ జరుగుతోంది. హాలీవుడ్ సూపర్ హీరో థోర్ ఫేం ని మహేష్ బాబు సినిమాలో తీసుకుంటున్నాడు రాజమౌళి. దీని కోసం భారీ సెట్ క్రియేట్ చేస్తున్నారని సమాచారం.

అన్ని కోట్లు ఖర్చు పెట్టే బదులు రియల్ ఫారెస్ట్‌లోనే షూట్ చేయొచ్చు కదా అనే సందేహం రావొచ్చేమో!! భారీ ఎక్స్‌ప్లోజివ్స్‌ని వాడబోతున్నారు కాబట్టి.. ప్రపంచంలో ఏ దేశ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ కూడా ఇందుకు పర్మిషన్ ఇవ్వదు. అలాంటి టైంలో హాలీవుడ్ మేకర్స్ 20-30 ఎకరాల వరకు ఇలా ప్లాస్టిక్ ట్రీస్‌తో చిన్నపాటి అడవిని సెట్ చేయడం.. అందులోనే భారీ బ్లాస్టింగ్ సీన్స్ తీయడం కామన్.

అయితే వాళ్లు కూడా ఎన్నడూ చేయంది. 100 ఎకరాల్లో ప్లాస్లిక్ చెట్లతో రియలిస్టిక్ అడవిని సెట్ చేసి రెండు నెలలు షూట్ చేయబోతున్నాడు రాజమౌళి. 1500 కోట్ల బడ్జెట్‌లో వందకోట్లు కేవలం ఈ అడవి సెట్‌కే ఉపయోగించడానికి కారణం.. ఇందులో హాలీవుడ్ సూపర్ హీరోని స్పెషల్ రోల్‌లో తీసుకుంటున్నారని టాక్. ఆల్రెడీ ఇండోనేషియా మూలాలున్న అమెరికన్ నటి చెల్సియాకు ‌తోడు.. హాలీవుడ్ హీరో కూడా వస్తుండడంతో వీటన్నింటికి తగ్గట్టే.. సినిమాను నెక్ట్స్‌ లెవల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సాయంతో ప్లాన్ చేశాడు రాజమౌళి. అందుకే కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం 100 ఎకరాల్లో వంద కోట్ల ఖర్చుతో అడవి సెట్‌తో ట్రెండ్ సెట్ చేయబోతున్నాడు.

ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సంక్రాంతి తర్వాత ప్రారంభించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను రెండు పార్టులుగా విడుదల చేయాలని ముందుగానే రాజమౌళి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News