Bachhala Malli Twitter Review: బచ్చల మల్లి ట్విట్టర్ రివ్యూ..అల్లరి నరేశ్ ఇరగదీశాడా?

Update: 2024-12-20 02:47 GMT

 Bachhala Malli Twitter Review: అల్లరి నరేష్ హీరోగా నటించిన రూరల్ రస్టిక్ డ్రామా సినిమా బచ్చలమల్లి. అల్లర్ నరేశ్ కు జోడీగా హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటించిన ఈ మూవీ శుక్రవారం రిలీజ్ అయ్యింది. ఇప్పటికే పలు చోట్ల పెయిడ్ ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. అయితే బచ్చలమల్లి ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

కమెడియన్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్న అల్లరి నరేష్..నాంది సినిమాతో మంచి సూపర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత సీరియస్ రూల్స్ తో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, ఉగ్రం వంటి సినిమాలు నాందిని క్రాస్ చేయలేకపోయాయి.

సీరియస్ అండ్ రస్టిక్ రోల్లో నటించిన సినిమా బచ్చలమల్లి. విలేజ్ బ్యాక్ డ్రాప్ రస్టిక్ డ్రామాగా రూపొందించిన ఈ మూవీకి సుబ్బు మంగాదేవి డైరెక్టర్. బచ్చలమల్లిలో అల్లరి నరేశ్ కు జోడీగా హనుమాన్ హీరోయిన్ అమృత అయ్యర్ నటించారు. రాజేష్ దండా ఈ సినిమాకు ప్రొడ్యూసర్. అయితే హైదరాబాద్, అమెరికా వంటి కొన్ని లొకేషన్స్ లో ఈ మూవీ ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలు చూసిన నెటిజన్స్ సినిమా ఎలా ఉందని చెబుతున్నారో ట్విట్టర్ రివ్యూలో తెలుసుకుందాం.

ఇప్పుడే సినిమా పూర్తయ్యింది. ఈ మల్లిగాడు గుర్తుండిపోతాడు అన్న. నాకు కావేరి లాంటి అమ్మాయి కావాలి. ఎందుకంటే చాలా బాగా యాక్ట్ చేసింది. డైరెక్టర్ బాగా తీసారు సినిమాను . ఎమోషనల్ ఫీల్ అయ్యేలా ఉంది. సాంగ్స్ బాగున్నాయని ఓ నెటిజన్ రాసుకోస్తూ..3.5రేటింగ్ ఇచ్చారు.


మ్యూజిక్, స్క్రిప్ట్ బాగుంది. కానీ టేకింగ్ అంతగా ఆకట్టుకోలేదు. కథలో నిజాయితీ కనిపిస్తోంది. ఆవిష్కరణలో మాత్రం లోపం ఉందని మరో నెటిజన్ చెబుతూ 2.25 రేటింగ్ ఇచ్చారు.


అల్లరితో అల్లరి నరేశ్ ఇరగదీశాడు. యాక్టింగ్, స్క్రీన్ ప్లే అద్భుతం. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ మూవీకి సోల్ అనొచ్చు. ఎఫెక్టివ్ డైరెక్టర్ అని సుబ్బు మంగాదేవి నిరూపించుకున్నారు. హీరోయిన్ అందంగా ఉంది అంటూ 3 స్టార్ రేటింగ్ ఇచ్చారు మరో నెటిజన్.


మొత్తానికి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది.


Tags:    

Similar News