పీఎమ్‌జే న్యూ ఇయర్‌ క్యాంపెయిన్‌లో తళుక్కుమననున్న సితార.. ప్రపంచ దిగ్గజ న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో..

Update: 2024-12-22 05:53 GMT

సినీతారలు బ్రాండ్లకు ప్రమోటర్స్‌గా వ్యవహరించడం సర్వసాధారణమైన విషయం. అయితే సినీ తారల పిల్లలు కూడా బ్రాండింగ్‌ మార్కెట్‌లోకి అడుగుపెడుతున్నారు. ఈ జాబితాలో ముందు వరుసలో ఉంటారు సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కూతురు సితార. ఇప్పటికే సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ లక్షలాది మంది ఫాలోవర్లను దక్కించుకున్న సితార తాజాగా బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రముఖ జువెలరీ సంస్థ పీఎమ్‌జే తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా సితారను సెలక్ట్‌ చేసుకుంది.

ఇప్పటికే సితారతో రూపొందించిన ప్రకటనను విడుదల చేశారు. కాగా సితారను తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకోవడం పట్ల పీఎమ్‌జే జ్యవెల్స్‌ సంతోషం వ్యక్తం చేసింది. సితార తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రచారాన్ని ప్రారంభించినందుకు ఎంతో థ్రిల్‌గా ఉందని తెలిపింది. ఈ ప్రకటనలో ప్రదర్శించిన కొత్త సేకరణ భారతీయ వారసత్వం, నైపుణ్యానికి సంబంధించిన వేడుకగా పీఎమ్‌జే అభివర్ణించింది.

ప్రచారంలో చూపించిన డిజైన్‌లు క్లిష్టమైన కళాత్మకతను మిళితం చేస్తాయని, వీటిలో అద్భుతమైన పచ్చలు, వజ్రాలు, కెంపులు ఉంటాయని పీఎమ్‌జే తెలిపారు. నూతన వధువులు మొదలు, పండుగల సందర్భాల్లో ఈ నగలు బెస్ట్‌ ఛాయిస్‌ అని తెలిపారు. ఈ నగలను ధరించిన వ్యక్తి రాయల్టీగా భావించేలా చేస్తుందని పీఎమ్‌జే చెబుతోంది. ఈ నగలు మహిళల అందాన్ని మరింత ప్రతిబింబిస్తుందని తెలిపారు.

టైమ్స్‌ స్క్వేర్‌లో..

ప్రపంచంలోనే అత్యంత గొప్ప వేదికల్లో ఒకటైన న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్ స్క్వేర్‌లో ఈ ప్రకటనను ఆవిష్కరించడం తమకు ఎంతో గర్వంగా ఉందని పీఎమ్‌జే తెలిపింది. అంతర్జాతీయ వినియోగదారులకు, భారతీయ ఆభరణాల గొప్పతనాన్ని ఇది వివరిస్తుందని పీఎమ్‌జే అభిప్రాయపడుతోంది. ఇది తమ బ్రాండ్‌ విస్తరణకు ఎంతో తోడ్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక ఈ ప్రచారం కేవలం మంచి ఆభరణాల గురించి వివరించడమే కాకుండా.. వారసత్వం, కళాత్మకతకు ప్రపంచానికి తెలియజేయడం కూడా అని పీఎమ్‌జే తెలిపింది. 

Tags:    

Similar News