Allu Arjun: అల్లు అర్జున్‎కు బిగ్ షాక్..బెయిల్ రద్దవుతుందా?

Update: 2024-12-23 02:34 GMT

Allu Arjun: అల్లు అర్జున్ కు బిగ్ షాక్ తగలనుందా. తెలంగాణ పోలీసులు షాక్ ఇవ్వబోతున్నారా. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున్ కు 4వారాల మధ్యంత బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 21 వరకు ఆయనకు బెయిల్ లభించింది. అయితే తెలంగాణ పోలీసులు ఆయన బెయిల్ రద్దు కోసం హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారని తెలుస్తోంది.

హైకోర్టు బెయిల్ ఇస్తూ..కొన్ని షరతులు పెట్టింది. కానీ అల్లు అర్జున్ ఆ షరతులను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ పదే పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారని పోలీసులు ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. ఇలా ప్రెస్ మీట్ పెట్టిన విషయం పెద్ద దుమారమే రేపుతోంది. బెయిల్ రూల్స్ కు విరుద్దగా ప్రెస్ మీట్ పెట్టారంటూ పోలీసులు ఫైర్ అవుతున్నారు.

డిసెంబర్ 21 రాత్రి 8గంటలకు తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టారు. తాను సినిమా చూస్తున్న సమయంలో పోలీసులు తన దగ్గరకు రాలేదన్నారు. కానీ ఆయన చెప్పింది అబద్ధం అంటూ నిరూపిస్తూ పోలీసులు ఓ వీడియోను సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఇలా పోలీసులకు వ్యతిరేకంగా అల్లు అర్జున్ మాట్లాడటం అబద్దమని చెప్పడం పోలీసులకు మరింత ఆగ్రహం తెప్పించేలా చేసింది. పోలీసులు సినిమా థియేటర్ లో అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లారని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పారు. కానీ తన దగ్గరకు పోలీసులు రాలేదని అల్లు అర్జున్ చెప్పడం సీఎంను అవమానించడమే కాదు..పోలీసులను కూడా అవమానపరిచినట్లేనన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మీడియాను, తెలుగు రాష్ట్రా ప్రజలను అల్లు అర్జున్ తప్పుదోవ పట్టిస్తున్నారని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

అయితే బెయిల్ మీదున్నప్పుడు కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయకూడదు. అది రూల్ అనే విషయం అల్లు అర్జున్ కు తెలియదా. కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి తెలుగు, ఇంగ్లీష్ లో మొత్తం కేసు గురించే మాట్లాడటం చట్ట విరుద్దమని పోలీసులు భావిస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. హైకోర్టు షరతులతో బెయిల్ ఇచ్చిందనే విషయం మర్చిపోవడం కరెక్ట్ కాదంటున్నారు. మొత్తానికి అల్లు అర్జున్ ఏరికోరి చిక్కులు తెచ్చుకుంటున్నారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News