Allu Arjun's request to FANS: ఏసీపీ విష్ణు మూర్తి ప్రెస్ మీట్ తరువాత అల్లు అర్జున్ ట్వీట్

Update: 2024-12-22 11:43 GMT

Allu Arjun's request to FANS: అల్లు అర్జున్ తన అభిమానుల కోసం ఎక్స్ ద్వారా ఒక మెసేజ్ పంపించారు. తన అభిమానులు తమ అభిప్రాయాలను బాధ్యాతాయుతంగా చెప్పాలని అన్నారు. ఎవరినీ వ్యక్తిగతంగా కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని సూచించారు. ఫ్యాన్స్ ముసుగులో గత కొన్ని రోజులుగా కొంతమంది ఫేక్ ప్రొఫైల్స్‌తో, ఫేక్ ఐడీలతో పోస్టులు పెడుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అల్లు అర్జున్ ఎక్స్ ద్వారా చెప్పారు.

నెగటివ్ పోస్టులు పెడుతున్న వారికి తన అభిమానులు దూరంగా ఉండాలని అల్లు అర్జున్ కోరారు. ఆన్‌లైన్‌లోనే కాదు... ఆఫ్‌లైన్‌లోనూ ఎవ్వరిపైనా దుర్భాషలకు దిగరాదని అల్లు అర్జున్ తన అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ ఈ ట్వీట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం చిక్కడపల్లి ఏసీపీ విష్ణు మూర్తి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ వైఖరిపై తన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తరువాత అల్లు అర్జున్ పెట్టిన మొదటి ట్వీట్ ఇదే కావడంతో ఇది ఆయన రియాక్షన్‌గా నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. 

నిన్న శనివారం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కొడుకు 9 ఏళ్ల శ్రీతేజ్ ఇంకా చావు బతుకుల్లోనే కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఆ విషయంలో అల్లు అర్జున్ వైఖరి సరికాదని హితవు పలికారు. అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసినందుకు తనపై నెగటివ్ పోస్టులు పెట్టారని సభలో స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. అల్లు అర్జున్ తప్పు చేసినందుకు పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారు. అందుకు నెగటివ్ పోస్టులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈ ట్వీట్ చేశారా అని కొందరు భావిస్తున్నారు. 

Tags:    

Similar News