Actress: జర్నీ మూవీ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా.? ఆ విషయంలో తగ్గేదేలే..!
Actress: 2011లో వచ్చిన జర్నీ మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు.
Actress: 2011లో వచ్చిన జర్నీ మూవీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సినిమాలో శర్వానంద్, జై, అనన్య, అంజలి ప్రధాన పాత్రలు పోషించారు. తమిళంలో ఎంగీయుం ఎప్పుతం పేరుతో వచ్చిన ఈ సినిమాను తెలుగులో జర్నీ పేరుతో డబ్ చేసిన విషయం తెలిసిందే. ఒక బస్సు ప్రయాణంలో సాగే మలుపులు, రెండు ప్రేమ జంటల జీవితాల్లో జరిగిన సంఘటనలను దర్శకుడు ఇందులో అద్భుతంగా చూపించాడు.
పేరుకు డబ్బింగి సినిమా అయినా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుందీ మూవీ. శర్వానంద్ నటించడంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైందని చెప్పాలి. ఫీల్ గుడ్ మూవీగా మొదలై ట్రాజడీతో ఎండ్ అయ్యే ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వచ్చినా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన అనన్య ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన విషయం తెలిసిందే.
శర్వానంద్‌కు జోడిగా అమాయక నటనతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ బ్యూటీ. కేరళకు చెందిన ఈ చిన్నది తొలి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమాతో తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. కానీ హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో ఛాన్స్‌లు రాలేవు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అఆ' మూవీతో తెలుగులో మొదటి స్ట్రెయిట్ ఫిల్మ్‌లో నటించింది.
ఈ సినిమాలో నితిన్‌కు చెల్లి పాత్రలో నటించి మెప్పించింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో చిన్న పాత్ర పోషించింది. అయితే తెలుగులో మెయిన్ లీడ్‌లో మాత్రం నటించలేదని చెప్పాలి. ఇదిలా ఉంటే అనన్య వివాహం 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తితో జరిగింది. వివాహం తర్వాత మలయాళంలో వరుస సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం మాత్రం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనన్య తన లేటెస్ట్ ఫొటోలను మాత్రం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటోంది. ఈ క్రమంలోనే తాను పోస్ట్ చేసిన లేటెస్ట్ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.