Pushpa Director Sukumar: ‘సినిమాలు వదిలేస్తా...’
Director Sukumar: సుకుమార్ సినిమాలు వదిలేస్తానంటూ చెప్పిన మాటలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి.
Director Sukumar: సుకుమార్ సినిమాలు వదిలేస్తానంటూ చెప్పిన మాటలు అందర్నీ షాక్‌కు గురిచేస్తున్నాయి. ఇటీవల అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ఈవెంట్‌లో సుకుమార్ పాల్గొన్నారు. ఈ ఈవెంట్‌లో సినిమాలోని ధూప్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో యాంకర్ సుమ సుకుమార్(Anchor Suma)ని ఒక ప్రశ్న అడిగారు. జీవితంలో ఏదైనా వదిలేయాల్సి వస్తే మీరు దేన్ని త్యాగం చేస్తారని అని ప్రశ్నించినప్పుడు, ఆయన ఠక్కున సినిమా అని చెప్పాడు.
దీంతో పక్కనే కూర్చున్న రామ్ చరణ్(Ram Charan) షాకయ్యాడు. ఆ తర్వాత సుకుమార్ దగ్గర మైక్ లాక్కొని అలా చేయరులే అని అన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ప్రజెంట్ సిచ్యుయేషన్ వల్ల సుకుమార్ ఇలాంటి కామెంట్ చేసి ఉంటారన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
పుష్ప2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం, ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటన వల్ల అల్లు అర్జున్(Allu Arjun) తీవ్ర ఇబ్బందుల్లో పడడం, ఈ ఘటన తర్వాత ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బన్నీపై విమర్శలు చేయడంతో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
ఈ ఘటనలతో డైరెక్టర్ సుకుమార్ మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్‌గా పుష్ప2 సక్సెస్ మీట్ లో మహిళ మృతి గురించి మాట్లాడిన సుకుమార్ తన బాధను వ్యక్తం చేశాడు. అయితే ఇప్పుడు ఏకంగా సినిమాలు వదిలేస్తా అని సంచలన ప్రకటన చేయడంతో అందరూ షాక్ అవుతున్నారు. డైరెక్టర్ రాజమౌళి తర్వాత ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న పేరు సుకుమార్. అలాంటి సుకుమార్ నోటి వెంట సినిమాలు మానేస్తా అనే మాట రావడానికి కారణం ఇటీవల జరుగుతున్న ఘటనలనే వార్తలు వినిపిస్తున్నాయి.