OTT: ప్రతీ సీన్ ఉత్కంఠ రేపుతుంది.. ఓటీటీలోకి వస్తోన్న ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్..!
OTT: ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి.
OTT: ఓటీటీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచుల్లో మార్పులు వచ్చాయి. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు జై కొడుతున్నారు. సినిమాలో మంచి కథ ఉంటే చాలు అది ఏ భాష అయినా పర్వాలేదని అనుకుంటున్నారు. దీంతో ఇతర భాషలకు చెందిన సినిమాలను సైతం పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. డబ్బింగ్ లేకపోయినా పర్లేదు సబ్ టైటిల్స్‌తోనే ఎంజాయ్ చేస్తున్నారు.
ముఖ్యంగా క్రైమ్ సంబంధిత సినిమాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కోలీవుడ్‌కు చెందిన ఓ మూవీ ఓటీటీ లవర్స్‌ని పలకరించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ ఏంటా సినిమా.? కథెంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆర్జే బాలాజీ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సొర్గవాసల్(Sorgavaasal). సిద్దార్థ్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ ఇంటెన్స్ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో సానియా ఇయప్పన్, సెల్వరాఘవన్, కరుణాస్, నట్టి సుబ్రమణ్యం, షరాఫ్ యు ధీన్, బాలాజీ శక్తివేల్, రవి రాఘవేంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
నవంబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిన ఈ మూవీ భారీ కలెక్షన్లను రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. థియేటర్లలో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్(Netflix) వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 27వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.
కథేంటంటే..
రోడ్డు పకకన ఫుడ్‌స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తుంటాడు హీరో. ఈ క్రమంలోనే అక్కడికి ఓ ఐఏఎస్ ఆఫీసర్ ప్రతీ రోజూ భోజనం చేయడానికి వస్తుంటాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఈ చొరవతోనే తనకు లోన్ ఇప్పించమని కోరుతాడు. లోన్ సాంక్షన్ అయిన తర్వాత లెటర్ తీసుకునేందుకు ఆఫీసర్ దగ్గరకు వెళ్లగా.. అదే సమయంలో ఆ అధికారి హత్యకు గురై ఉంటాడు. దీంతో హీరోను నిందితుడిగా భావించిన పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇంతకీ ఆ అధికారిని ఎవరు చంపారు.? చివరికి హీరో ఏం చేశాడు.? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.