ICC Champions Trophy 2025 schedule: ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడంటే...

Update: 2024-12-24 13:22 GMT

ICC Champions Trophy 2025 schedule announced, India vs Pakistan Match: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది. 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9వ తేదీ వరకు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు జరగనున్నాయి.

2025 ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూపులు

గ్రూప్-A: భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్

గ్రూప్ B: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్

2025 ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌ల పూర్తి జాబితా

ఫిబ్రవరి 19- పాకిస్తాన్ Vs న్యూజిలాండ్, కరాచీ

ఫిబ్రవరి 20- భారత్ Vs బంగ్లాదేశ్, దుబాయ్

ఫిబ్రవరి 21- ఆఫ్ఘనిస్తాన్ Vs దక్షిణాఫ్రికా, కరాచీ

ఫిబ్రవరి 22- ఆస్ట్రేలియా Vs ఇంగ్లాండ్, లాహోర్

ఫిబ్రవరి 23- ఇండియా Vs పాకిస్తాన్, దుబాయ్

ఫిబ్రవరి 24- బంగ్లాదేశ్ Vs న్యూజిలాండ్, రావల్పిండి

ఫిబ్రవరి 25- ఆస్ట్రేలియా Vs దక్షిణాఫ్రికా, రావల్పిండి

ఫిబ్రవరి 26- ఆఫ్ఘనిస్థాన్ Vs ఇంగ్లాండ్

ఫిబ్రవరి 27- పాకిస్తాన్ Vs బంగ్లాదేశ్, రావల్పిండి

ఫిబ్రవరి 28- ఆఫ్ఘనిస్థాన్ Vs ఆస్ట్రేలియా, లాహోర్

మార్చి 1  దక్షిణాఫ్రికా Vs ఇంగ్లాండ్, కరాచీ

మార్చి 2 - భారత్ Vs న్యూజిలాండ్, దుబాయ్

మార్చి 4 - దుబాయ్లో సెమీఫైనల్ 1

మార్చి 5 - లాహోర్లో సెమీఫైనల్ 2

మార్చి 9- లాహోర్లో ఫైనల్ (భారత్ అర్హత సాధించినట్లయితే, దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది).

మార్చి 10- రిజర్వ్ డే. 

అన్ని దేశాల క్రికెట్ ప్రియులు ఎదురుచూసే క్రికెట్ మ్యాచ్

ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో అన్ని దేశాల క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూసే మ్యాచ్ ఏదైనా ఉందా అంటే అది ఇండియా vs పాకిస్థాన్ మ్యాచ్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రికెట్‌లో ఏ టోర్నమెంట్ తీసుకున్నా సరే... ఇండియా, పాకిస్థాన్ జట్లు ఫేస్ టు ఫేస్ తలపడుతున్నాయంటే ఆ మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు. ఆ విషయం ఆ మ్యాచ్ జరిగిన రోజు మ్యాచ్‌ను ప్రసారం చేసే స్పోర్ట్స్ టీవీ ఛానెల్‌కు వచ్చే టీఆర్పీ రేటింగ్స్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఈ ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 23న మ్యాచ్ షెడ్యూల్ చేశారు. దుబాయ్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు (IND vs PAK Match) వేదిక కానుంది. 

Tags:    

Similar News