Sachin Tendulkar: తన బౌలింగ్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్‌ను మెప్పించిన 12 ఏళ్ల అమ్మాయి..!
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ఏ క్రికెటర్‌నైనా పొగిడితే అందులో ఏదో ప్రత్యేకత ఉండాల్సిందే.
Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ ఏ క్రికెటర్‌నైనా పొగిడితే అందులో ఏదో ప్రత్యేకత ఉండాల్సిందే. తను ఎవరైనా వర్ధమాన క్రికెటర్ గురించి మాట్లాడితే.. అందరూ అతనిపై దృష్టి పెడతారు. దీంతో తన అదృష్టం కూడా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 12 ఏళ్ల బాలిక విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది. ఆమె కోసం మాస్టర్ బ్లాస్టర్ స్వయంగా ప్రత్యేక పోస్ట్ చేసాడు. ఇప్పుడు దేశంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ప్రస్తుతం తన అద్భుతమైన బౌలింగ్ యాక్షన్‌తో వార్తల్లో నిలుస్తున్న రాజస్థాన్‌కు చెందిన 12 ఏళ్ల అమ్మాయి సుశీలా మీనా.
గత కొన్ని రోజులుగా సుశీల బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె ఒక గ్రామంలోని చిన్న మైదానంలో బౌలింగ్ చేస్తూ కనిపించింది. అయితే ఈ వీడియో కేవలం బౌలింగ్ కారణంగానే కాకుండా యాక్షన్ కారణంగా వార్తల్లో నిలిచింది. ఈ స్లో మోషన్ వీడియోలో సుశీల తన ఎడమ చేతితో బౌలింగ్ చేస్తూ కనిపించింది. ఆమె యాక్షన్ సరిగ్గా భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్‌ను గుర్తు చేస్తుంది. ఇదే సచిన్ దృష్టిని కూడా ఆకర్షించింది.
గ్రేట్ ఇండియన్ బ్యాట్స్‌మెన్ సచిన్ డిసెంబర్ 20 శుక్రవారం తన సోషల్ మీడియా ఖాతాలో సుశీల వీడియోను పోస్ట్ చేశాడు. ఇందులో సుశీల యాక్షన్ చాలా స్మూత్ గా, క్యూట్ గా ఉందని వివరించారు. సచిన్ జహీర్ ఖాన్‌ను ట్యాగ్ చేసి, సుశీల యాక్షన్లో జహీర్ ఖాన్ కనిపిస్తున్నాడని రాసుకొచ్చారు. జహీర్ కూడా మాస్టర్ బ్లాస్టర్‌తో ఏకీభవించాడు. రాజస్థాన్‌లోని ఓ గ్రామంలో రైతు కుటుంబం నుంచి వచ్చిన సుశీల ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. పల్లెటూర్లో ఉండే ఆమె తన ప్రతిభను మెరుగుపరచడానికి సహాయం అవసరం.. సరిగ్గా సచిన్ చేసిన ఈ ఒక పోస్ట్ ఆ పనిని పూర్తి చేసినట్లు అనిపిస్తుంది.
సచిన్ పోస్ట్‌పై దేశంలోని అతిపెద్ద పారిశ్రామిక సంస్థలలో ఒకటైన ఆదిత్య బిర్లా గ్రూప్ స్పందించింది. దాదాపు రూ. 18 లక్షల కోట్ల నికర విలువ కలిగిన కుమార్ మంగళం బిర్లా కంపెనీ అధికారిక 'X' హ్యాండిల్, తన 'ఫోర్స్ ఫర్ గుడ్' చొరవ కింద, సుశీలకు క్రికెట్ శిక్షణ ఇవ్వాలనుకుంటున్నానని, తద్వారా ఆమె క్రికెట్లో రాణించగలదని రాశారు. బిర్లా గ్రూప్ నుండి వచ్చిన ఈ సహాయం సుశీలకు చేరుతుందని, తద్వారా ఆమె తన కలను సాకారం చేసుకోగలదని అంతా భావిస్తున్నారు.