Nitish Kumar Reddy's Real Story: ప్రతి నెలా రూ.15 వేలు.. కష్టాల నడుమ నితీష్ కుమార్ రెడ్డి ప్రయాణం.. ఇన్‌సైడ్ స్టోరీ

Nitish Kumar Reddy's Real Story:తన కుమారుడి క్రికెట్ కెరీర్‌లో ఎమ్‌ఎస్‌కె ప్రసాద్ గొప్ప సహకారం అందించారని నితీష్ కుమార్ రెడ్డి తండ్రి అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌కే ప్రసాద్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి కెరీర్‌కు కొత్త రూపురేఖలు తెచ్చారన్నారు.

Update: 2024-12-29 08:47 GMT

Nitish Kumar Reddy's Real Story: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో మూడో రోజు సెంచరీ చేసి నితీష్ కుమార్ రెడ్డి వార్తల్లో నిలిచాడు. ఈ భారత ఆల్‌రౌండర్ తన సెంచరీ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఉన్న భారత అభిమానులకు ఫుల్ కిక్ అందించింది. అయితే నితీష్ కుమార్ రెడ్డి ఇక్కడి వరకు రావడానికి అతడి ప్రయాణం అంత సులభం ఏమీ కాలేదు. నితీష్ కుమార్ రెడ్డికి కేవలం 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, అతని తండ్రి అతనిని భారత మాజీ సెలెక్టర్, క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్ వద్దకు తీసుకెళ్లారు.

నితీష్ కుమార్ రెడ్డి ప్రయాణం అలాంటిదే

తన కుమారుడి క్రికెట్ కెరీర్‌లో ఎమ్‌ఎస్‌కె ప్రసాద్ గొప్ప సహకారం అందించారని నితీష్ కుమార్ రెడ్డి తండ్రి అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌కే ప్రసాద్‌ నితీష్‌ కుమార్‌ రెడ్డి కెరీర్‌కు కొత్త రూపురేఖలు తెచ్చారన్నారు. తండ్రి నితీష్ కుమార్ రెడ్డిని ఎంఎస్‌కే ప్రసాద్ వద్దకు తీసుకెళ్లినప్పుడు, ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీని తర్వాత నితీష్ కుమార్ రెడ్డి ప్రతిభను ఎంఎస్కే ప్రసాద్ గుర్తించారు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డిని ఆంధ్ర క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు పరిచయం చేశాడు. ఇక్కడి నుంచి అతని కెరీర్‌ రూపుదిద్దుకోవడం ప్రారంభించింది.

నెలకు రూ.15 వేలతో అదృష్టం!

అయితే ఇంత జరిగినా నితీష్ కుమార్ రెడ్డికి ప్రయాణం అంత సులువు కాలేదు. నిజానికి అతని క్రికెట్‌కు, చదువుకు ఆర్థిక సహాయం తీసుకోవాల్సిన అవసరం పడింది. ఆ తర్వాత ఆంధ్రా క్రికెట్ మేనేజ్‌మెంట్ ఈ బాధ్యతను తీసుకుంది. నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ మేనేజ్‌మెంట్ నుండి నెలకు రూ. 15,000 రావడం ప్రారంభించింది. దీంతో క్రికెట్‌తో పాటు చదువుకు అయ్యే ఖర్చులు కూడా భరించగలిగాడు. ఐపీఎల్‌లో నితీష్ కుమార్ రెడ్డి తన సత్తాతో అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్‌లో సందడి చేసిన నితీష్ కుమార్ రెడ్డికి భారత జట్టులో అవకాశం లభించింది.

Tags:    

Similar News