Nitish Reddy: ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న నితీష్ రెడ్డి సోదరి... ఆనాటి జ్ఞాపకం

Update: 2024-12-29 08:29 GMT

Nitish Kumar Reddy's sister Tejaswi Reddy: మెల్‌బోర్న్ టెస్టులో మూడో రోజు సెంచరీ చేయడం ద్వారా నితీష్ కుమార్ రెడ్డి ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. నితీష్ సాధించిన విజయానికి అతని తల్లిదండ్రులు, సోదరి కూడా గర్వంగా ఫీలవుతున్నారు. నితీష్ రెడ్డిని క్రికెటర్‌గా తీర్చిదిద్దడంలో ఆయన తండ్రి ముత్యాల రెడ్డి చేసిన త్యాగం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలుస్తోంది. అయితే నితీష్ సోదరి తేజస్వీ రెడ్డి రెండేళ్ల క్రితం వరకు ఉక్రెయిన్‌లో ఉన్న విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఉక్రెయిన్, రష్యా మధ్య చాలా సంవత్సరాలుగా యుద్ధం నడుస్తోంది. గత మూడేళ్లుగా ఈ యుద్ధం తీవ్రస్థాయికి చేరింది.

2022 లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తీవ్రరూపం దాల్చినప్పుడు సుమారు 25 వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. అందులో ఒకరు నితీష్ కుమార్ రెడ్డి అక్క తేజస్వి. ఆ సమయంలో ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి 25,000 మందిని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చారు. వాస్తవానికి ఆ సమయంలో తేజస్వీ రెడ్డి ఉక్రెయిన్‌లో ఉన్నారు. అక్కడ ఆమె వైద్య విద్యను అభ్యసిస్తున్నారు.

నితీష్ కుమార్ రెడ్డి కుటుంబంలోని ప్రతి ఒక్కరు ఒకరినొకరు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా ఎవరికైనా ఏదైనా ఆపద ఎదురైతే మొత్తం కుటుంబం ఆందోళన చెందుతుంది. యుద్ధం సమయంలో తేజస్వి ఉక్రెయిన్‌లో చిక్కుకున్నప్పుడు ఆ కుటుంబం కూడా అలాగే ఆందోళనలో మునిగిపోయింది. ముత్యాల రెడ్డి కుటుంబం ఆర్థిక పరిస్థితి అంత బలంగా లేకపోవడంతో, వారి స్వంత ఖర్చుతో వారిని తిరిగి భారతదేశానికి తీసుకురాలేకపోయారు. అటువంటి పరిస్థితిలో, తేజస్వి కూడా ఆపరేషన్ గంగా కింద భారతదేశానికి తిరిగి రాగలిగింది. ఆ సమయంలో భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి పోలాండ్ మీదుగా భారత్‌కు తీసుకొచ్చారు.

Tags:    

Similar News