Virat Kohli: విరాట్ కోహ్లి దివంగత తండ్రిని ఎగతాళి చేస్తూ ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక గలీజు రాతలు
Virat Kohli: ప్రస్తుతం ఆస్ట్రేలియన్ మీడియా, ముఖ్యంగా అక్కడ ఒక వార్తాపత్రిక పూర్తిగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసింది.
Virat Kohli: మెల్ బోర్న్ టెస్టులో అద్భుత సెంచరీ సాధించి మ్యాచ్ గెలవాలన్న ఆస్ట్రేలియా ఆశలపై టీమిండియా యువ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి నీళ్లు చల్లాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు టీమిండియాతో సమానంగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు ఆటతీరుతో విసిగిపోయిన అక్కడి మీడియా ఇప్పుడు భారత ఆటగాళ్లను టార్గెట్ చేస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియన్ మీడియా, ముఖ్యంగా అక్కడ ఒక వార్తాపత్రిక పూర్తిగా టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసింది. ఇప్పుడు ఈ వార్తాపత్రిక అసభ్యత అన్ని పరిమితులను దాటేసింది, కోహ్లి దివంగత తండ్రిని ఎగతాళి చేసింది.
మెల్‌బోర్న్ టెస్టు మ్యాచ్‌లో తొలి రోజు ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కాన్‌స్టంట్స్ భుజంపై విరాట్ కోహ్లీ కొట్టాడు. అప్పటి నుంచి ఆస్ట్రేలియా మీడియా విరాట్ కోహ్లిని టార్గెట్ చేస్తూ పలు కథనాలను అల్లుతోంది. అయితే, ఈ విషయం మొదటి రోజు సెటిల్ అయిన తర్వాత కూడా ఒక వార్తాపత్రిక, ది వెస్ట్ ఆస్ట్రేలియన్, ఇప్పటికీ కోహ్లీనే టార్గెట్ చేసింది. వివాదం తర్వాత, ఈ వార్తాపత్రిక కోహ్లీ ఫోటోను వక్రీకరించి, అతన్ని జోకర్‌గా ప్రకటించింది. ఇది కాకుండా సదరు పత్రిక దుష్ప్రవర్తన అన్ని పరిమితులను దాటింది.
టెస్ట్ మూడో రోజు తర్వాత, వెస్ట్ ఆస్ట్రేలియన్ వార్తాపత్రిక దిగజారిపోయింది. వార్తాపత్రిక తన స్పోర్ట్స్ పేజీలో విరాట్ కోహ్లీ తండ్రి గురించి చెడు శీర్షికను పెట్టింది. ఇది అందరినీ ఆగ్రహానికి గురి చేసింది. ఈ వార్తాపత్రిక సామ్ కాన్స్టాంట్స్ ఫోటోను ముద్రించింది. ఇంకా చెప్పాలంటే.. ఈ పత్రిక వార్తలో కోహ్లీని 'ఇండియన్ సూక్' అని సంభోదించింది. దీనర్థం పిరికివాడని. ఇటువంటి వార్తలు ప్రచురించి నాలుగు పత్రికలు ఎక్కువ అమ్ముకోవచ్చేమో కానీ, అభిమానుల్లో భారత క్రికెటర్‌కు ఉన్న ఆదరణను, అభిమానాన్ని ఎవరూ తగ్గించలేరని గవాస్కర్ అన్నారు.
న జట్టు కోసం మైదానంలోకి వచ్చినప్పటికీ ఈ వార్తాపత్రిక ఇలాంటి చర్యలకు దిగింది. ఈ ఫోటో బయటికి రాగానే భారతీయ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్ట్రేలియన్ జర్నలిస్టును బండబూతులు తిడుతున్నారు.