India vs Australia 4th Test: భారత్ ఓటమి
India vs Australia 4th Test: అస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు ఓడింది.
India vs Australia 4th Test: అస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు ఓడింది. 340 టార్గెట్ చేరుకోవడంలో భారత జట్టు బ్యాట్స్ మెన్ విపలమయ్యారు. 155 పరుగులకే భారత బ్యాట్య్ మెన్ పెవిలియన్ చేరారు. భారత్ పై 184 పరుగుల తేడాతో అస్ట్రేలియా విజయం సాధించింది. ఐదు టెస్టుల సిరీస్ లో 2-1 తేడాతో అస్ట్రేలియా ముందంజలో ఉంది.
భారత బ్యాట్స్ మెన్ యశస్వి జైశ్వాల్, రిషబ్ పంత్ మినహా మిగిలిన బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. జైశ్వాల్ 84, పంత్ 30 పరుగులు చేశారు. రోహిత్ 9, కోహ్లి 5, ఆకాశ్ దీప్ 7, జడేజా 2, నితీశ్ రెడ్డి 1 పరుగు చేసి ఔటయ్యారు. కేఎల్ రాహుల్, బుమ్రా, సిరాజ్ డకౌట్ అయ్యారు. 2025 జవరి 3న సిడ్నీలో చివరి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
ఆసీస్ బౌలర్లలో కమిన్స్, బోలాండ్ మూడేసి వికెట్లు తీసుకున్నారు. నాథన్ లైయర్ 2 వికెట్లు, మిచెల్ స్టార్క్, హెడ్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 474 పరుగులు చేసింది. భారత జట్టు కేవలం 369 పరుగులు మాత్రమే చేసింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ 234 పరుగులకు అలౌటైంది. భారత జట్టు 155 పరుగులకే కుప్పకూలింది.
రోహిత్ శర్మ , కోహ్లి ఈ ఇన్నింగ్స్ లో కూడా అదే ధోరణితో ఆడారు. రోహిత్ శర్మ కమిన్స్ బౌలింగ్ లో ఔటయ్యారు. ఆ తర్వాత కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరారు. ఒకే ఓవర్ లో ఈ ఇద్దరు ఔట్ కావడంతో భారత బ్యాట్స్ మెన్ పై ఒత్తిడి పెరిగింది. కోహ్లి ఫస్ట్ ఇన్నింగ్స్ లో కొంత ఫర్వాలేదనిపించారు.
రెండో ఇన్నింగ్స్ లో మాత్రం రాణించలేదు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో నితీశ్ రెడ్డి సెంచరీ చేశారు. రెండో ఇన్నింగ్స్ లో యశస్వి రాణించారు.రెండో ఇన్నింగ్స్ లో నితిశ్, జడేజా అంతగా ప్రభావం చూపలేదు. ఇక బౌలింగ్ లో జస్ ప్రీత్ బుమ్రా తన దూకుడును కొనసాగించారు.ఈ మ్యాచ్ లో కూడా 9 వికెట్లు తీశారు.