Virat Kohli: భార్యా పిల్లలతో విరాట్ కోహ్లీ లండన్‎కు మకాం..కన్ఫమ్ చేసిన కోచ్

Update: 2024-12-20 05:13 GMT

Virat Kohli: విరాట్ కోహ్లీ లండన్ కు మకాం మార్చుతున్నాడట. భార్య అనుష్క శర్మ, పిల్లలతో కలిసి లండన్ లో స్థిరపడనున్నాడట. ఈవిషయాన్నిఅతని చిన్న నాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ కన్ఫర్మ్ చేశారు. ఈ మధ్యకాలంలో విరాట్ చాలా కాలం వరకు లండన్ లో ఉన్నారు. విరాట్ తనయుడు అకాయ్ కూడా అక్కడే జన్మించిన సంగతి తెలిసిందే. అయితే రిటైర్మెంట్ వరకు మాత్రమే భారత్ లో ఉంటాడంటూ అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ చెప్పడం గమనార్హం.

విరాట్ త్వరలోనే శాశ్వతంగా లండన్ కు షిఫ్ట్ కానున్నట్లు అతను వెల్లడించాడు. అందుకు రంగం సిద్ధం చేసుకునేందుకు ఈ ఏడాదిలో అతడు చాలా వరకు లండన్ లోనే కాలం వెళ్లదీసినట్లు అర్థమవుతోంది. ఈ ఏడాది మొదట్లోనే విరాట్ కు అకాయ్ అనే కుమారుడు లండన్ లోనే జన్మించారు. కాగా ఇప్పటికే విరాట్, అనుష్కలకు లండన్ లో ఓ ఇల్లు కూడా ఉంది.

విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క, పిల్లలతో కలిసి లండన్ లో స్థిరపడాలని అనుకుంటున్నాడు. త్వరలోనే ఇండియాను వదిలివెళ్తాడు. అయితే ప్రస్తుతానికైతే క్రికెట్ కాకుండా ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నాడు అని దైనిక్ జాగరన్ తో రాజ్ కుమార్ శర్మ చెప్పాడు.

ఇక విరాట్ ఇప్పట్లో రిటైర్ కారని కోచ్ రాజ్ కుమార్ శర్మ తెలిపారు. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగే ఛాన్స్ ఉన్నట్లు చెప్పాడు. తన కెరీర్ లో విరాట్ బెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో సెంచరీ కూడా చేశాడు. తర్వాత రెండు మ్యాచులలో మరో రెండు సెంచరీలు చేస్తాడని అనుకుంటున్నాను. తన గేమ్ ను ఎప్పుడూ ఎంజాయ్ చేసిన ప్లేయర్. ఏ ప్లేయర్ అయినా తన గేమ్ ఎంజాయ్ చేస్తే తన బెస్ట్ అవుతాడు. విరాట్ ఫామ్ పై ఆందోళన లేదని శర్మ అన్నారు.

Tags:    

Similar News