Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ ఆశ్విన్ గుడ్ బై

Ravichandran Ashwin retirement: అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత బుధవారం ఆయన ఈ ప్రకటన చేశారు.

Update: 2024-12-18 06:21 GMT

Ravichandran Ashwin: అంతర్జాతీయ క్రికెట్ కు రవిచంద్రన్ ఆశ్విన్ గుడ్ బై

Ravichandran Ashwin retirement: భారత క్రికెటర్ రవిచంద్రన్ ఆశ్విన్ (Ravichandran Ashwin) అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. అస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన తర్వాత బుధవారం ఆయన ఈ ప్రకటన చేశారు. టెస్టుల్లో 537 వికెట్లు తీశారు. 106 మ్యాచుల్లోనే ఆయన ఈ వికెట్లు పడగొట్టారు. భారత జట్టు మాజీ ఆటగాడు అనిల్ కుంబ్లే 619 వికెట్లు తీశారు. ఆయన తర్వాతి స్థానంలో ఆశ్విన్ నిలిచారు.

బ్యాటింగ్ లో కూడా ఆయన సత్తా చాటారు. మొత్తం మ్యాచుల్లో ఆయన 3,503 పరుగులు చేశారు. భారత జట్టు తరపున ఆశ్విన్ 116 వన్ డేలు, 65 టీ 20 మ్యాచ్ లు ఆడారు. ఇందులో 4,400 పరుగులు సాధించారు. టెస్టులు, వన్డేల్లో ఆయన 765 వికెట్లు తీశారు.

భావోద్వేగానికి గురైన ఆశ్విన్

అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడానికి ముందు డ్రెస్సింగ్ రూమ్ లో ఆశ్విన్ విరాట్ కోహ్లితో మాట్లాడారు. ఈ సమయంలో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. కోహ్లి ఆయనను ఆలింగనం చేసుకుని సముదాయించారు. అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పినందున అస్ట్రేలియాతో జరిగే మరో టెస్టుల్లో ఆశ్విన్ ఆడరు. డిసెంబర్ 19న ఆయన ఇండియాకు తిరిగి వస్తారు. ఆశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు.

Tags:    

Similar News