Virat Kohli: నా పిల్లల ఫొటోలు తీస్తారా? మహిళా జర్నలిస్టుతో విరాట్ కోహ్లీ వాగ్వాదం

Update: 2024-12-19 14:41 GMT

Virat Kohli slams Australian media: ఆస్ట్రేలియా మీడియాపై టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫైర్ అయ్యారు. తన కుటుంబ సభ్యులను వీడియో తీయొద్దని ఎంత చెప్పినా వినకుండా ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంతో కోహ్లీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగో టెస్ట్ మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్‌ 26 నుంచి ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా గురువారం మెల్‌బోర్న్‌కు చేరుకుంది. మెల్‌బోర్న్ విమానాశ్రయానికి సతీమణి అనుష్క శర్మతో పాటు వామికా, అకాయ్‌లతో విరాట్ కోహ్లీ రాగా ఆసీస్ మీడియా వారిని తమ కెమెరాలతో షూట్ చేయడం మొదలుపెట్టింది.

కోహ్లీ కుటుంబాన్ని ఫొటోలు, వీడియోలు తీసేందుకు ప్రయత్నించింది. వద్దని చెప్పినా వినకుండా ఫొటోలు తీయడంతో అసహానానికి గురైన కోహ్లీ వారితో వాగ్వాదానికి దిగాడు. నా పిల్లల విషయంలో నాకు కొంత ప్రైవసీ కావాలి. నన్ను అడగకుండా మీరు ఫొటోలు తీయొద్దన్నాడు. వినని ఆసీస్ మీడియా అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఓ మహిళా జర్నలిస్టును గట్టిగా మందలించాడు కోహ్లీ. తీసిన వీడియోను డిలీట్ చేయాలని సూచించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

తమ పిల్లలను మీడియాకు దూరంగా, స్వేచ్ఛగా పెంచాలనుకున్నాడు కోహ్లీ. అందుకే తన పిల్లల గోప్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు. సోషల్ మీడియాలో వారి ఫొటోలను పోస్ట్ చేస్తే ముఖాలు కనిపించకుండా ఇమోజీలు ఉంచుతాడు.

ఇక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విషయానికొస్తే... తొలి టెస్టులో భారత్, రెండో టెస్టులో ఆసిస్ గెలిచాయి. బ్రిస్బేన్‌లో జరిగిన మూడో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది.

Tags:    

Similar News