Trevor Jacob: సబ్ స్క్రైబర్స్ కోసం భారీ ప్లాన్.. ఏకంగా విమానాన్నే కూల్చేశాడు.. కట్ చేస్తే.. కటకటాల వెనక్కి..!
Trevor Jacob: ట్రెవోర్ జాకోబ్..ఈ యూ ట్యూబర్ గుర్తున్నాడా మీకు..ఐ క్రాష్డ్ మై ప్లేన్ టైటిల్ తో ఒక వీడియోని రిలీజ్ చేశాడు.
Trevor Jacob: ట్రెవోర్ జాకోబ్..ఈ యూ ట్యూబర్ గుర్తున్నాడా మీకు..ఐ క్రాష్డ్ మై ప్లేన్ టైటిల్ తో ఒక వీడియోని రిలీజ్ చేశాడు. ఈ వీడియోలో ఓ చిన్న విమానాన్ని నడుపుతూ దాన్ని కూల్చేశాడు. విమానం ఇంజిన్ లో సమస్యలు రావడంతో పారాచూట్ సాయంతో బయటకు దూకేశాడు. అంతేకాదు విమానం కూలిపోతుండగా దాన్ని ట్రెవోర్ పూర్తిగా చిత్రీకరించాడు. విమానంలో పల భాగాల్లో అమర్చిన కెమెరాల్లో ప్రమాదాన్ని ట్రెవోర్ కంప్లీట్ గా రికార్డ్ చేశాడు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియోని ట్రెవోర్ అప్ లోడ్ చేస్తే..2 కోట్ల మందికి పైగా చూశారు. ట్రెవోర్ పారాచూట్ సాయంతో దూకడం, విమాన కూలడం,శిథిలాల దగ్గరికి వెళ్లి చూడడం అంతా వీడియోలో చూస్తుంటే ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మాదిరి అనిపించింది. ఈ వీడియో చూసినవాళ్లు ట్రెవోర్ సాహనాన్ని తెగ పొగిడేశారు. కట్ చేస్తే ఇప్పుడు అసలు విషయం బయటపడింది.
ట్రెవోర్ కావాలనే తన విమానాన్ని కూల్చేశాడట. విమానం కూలడాన్ని సాధారణ జనంతో పాటు ఏవియేషన్ అధికారులు తొలుత విశ్వసించారు. అయితే పారాచూట్ సాయంతో బయటకు దూకే సమయంలో అతడి చేతిలో సెల్ఫీ స్టిక్ ఉండడం, విమానంలో పలు భాగాల్లో కెమెరాలను అమర్చడం..చూసి అధికారులకు ప్రీ ప్లాన్డ్ గా ఉందని అనుమానం కలిగింది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేయగా ట్రెవోర్ తొలుత బుకాయించినప్పటికీ..ఆ తర్వాత సబ్ స్క్రైబర్స్ ను పెంచుకునేందుకునే విమానాన్ని కూల్చేశానని అంగీకరించాడు. దర్యాప్తు సమయంలో శకలాలు ఎక్కడ ఉన్నాయో తనకు తెలియదని చెప్పిన ట్రెవోర్..ఆ తర్వాత ఓ హెలికాఫ్టర్ లో ప్రమాద స్థలానికి వెళ్లి విమాన శిథిల్లాలను వేరే ప్రదేశానికి చేర్చి వాటిని ధ్వంసం చేసినట్లు కూడా బయటపడింది.
వ్యూస్ కోసమే విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చానని ట్రెవోర్ అంగీకరించడంతో..అధికారులు అతడిపై చర్యలకు ఉపక్రమించారు. ఉద్దేశపూర్వకంగా ప్రమాదానికి పాల్పడడం, సాక్ష్యాలు నాశనం చేయడం తదితర అభియోగాలను ట్రెవోర్ పై మోపారు. ఈ కేసులో అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా ఉంది. మొత్తానికి, ఈ ఎపిసోడ్ అంతా తెలుసుకున్న నెటిజన్స్..సైబ్ స్క్రైబర్స్ కోసం కక్కుర్తి పడి..కటకటాల పాలయ్యేలా ఉన్నాడని..కామెంట్స్ చేస్తున్నారు.