ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెన ప్రారంభం.. పొడవు 4.6 కి.మీ., టవర్ల ఎత్తు 318 మీ.

World's Longest Hanging Bridge: *నిర్మాణంలో పాల్గొన్న 5వేల మంది కార్మికులు *మొత్తం 18.98వేల కోట్ల వ్యయం

Update: 2022-03-19 08:23 GMT

ప్రపంచంలోనే పొడవైన వేలాడే వంతెన ప్రారంభం.. పొడవు 4.6 కి.మీ., టవర్ల ఎత్తు 318 మీ.

World's Longest Hanging Bridge: ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేలాడే బ్రిడ్జిని టర్కీ అధ్యక్షుడు తయ్యిప్‌ ఎర్డోగాన్ ప్రారంభించారు. ఉత్తర టర్కీలోని కనక్కలే ప్రావిన్స్‌లోని డార్డనెల్లెస్‌ జలసంధిపై ఈ సస్పెన్షన్‌ బ్రిడ్జిని టర్కీ, దక్షిణ కొరియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. దీనికి 2.8 బిలియన్‌ డాలర్లు అంటే.. సుమారు 18 వేల 986 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జిని 4.6 కిలోమీటర్ల పొడవున నిర్మించారు.

2017 మార్చిలో ప్రారంభమైన ఈ వేలాడే వంతెన నిర్మాణాన్ని డార్డానెల్లెస్‌ బ్రిడ్జి ప్రాజెక్టు పేరుతో అధ్యక్షుడు ఎర్డోగాన్‌ ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణంలో 5వేల మంది కార్మికులు పని చేశారు. టర్కీ ప్రభుత్వం ఇస్తాంబుల్‌లో మూడు, కనక్కలే ప్రావిన్స్‌లోఒక వంతెనను నిర్మించింది. కనక్కలే బ్రిడ్జి నాలుగోది. దీని టవర్లు 318 మీటర్ల ఎత్తుతో, 4.6 కిలోమీటర్ల పొడువన నిర్మించారు.

Tags:    

Similar News