WHO : కరోనా మహమ్మారి ఏమీ చివరిది కాదు : డబ్ల్యూహెచ్‌ఓ
WHO : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలన్ని కృషి చేస్తున్నాయి
WHO : కంటికి కనిపించని కరోనా వైరస్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు ప్రపంచదేశాలన్ని కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికను జారీ చేసింది. ప్రపంచానికి కరోనా మహమ్మరే చివరిది కాదని ఆ తర్వాత వచ్చే సంక్షోభాలకు కూడా అన్ని దేశాలు సన్నద్దంగా ఉండలాని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ అథనోమ్ వ్యాఖ్యానించారు.. " ఇదే చివరి మహమ్మారి కాదు.. వైరస్ ల విజృంభణ, మహమ్మరుల జీవితంలో భాగం.. భవిష్యత్తులో మహమ్మారి వస్తే దానిని ఎదురుకునేందుకు ప్రపంచం రెడీగా ఉండాలి. ఇప్పటికంటే అప్పుడు ఇంకా మెరుగ్గా ఉండాలి. ప్రజా ఆరోగ్యం పైన చాలా ఖర్చు చేయాలని " ఆయన అన్నారు..
ఇక ఇదిలా ఉంటే, కేవలం ఏ ఒక్కదేశమో వ్యాక్సిన్ పంపిణీ చేపట్టినంత మాత్రాన మహమ్మారిని అరికట్టలేమని డబ్ల్యూహెచ్‌ఓ అభిప్రాయపడింది. కాగా, కరోనా వ్యాక్సిన్ అన్ని దేశాలకు సమానంగా అందేలా 'కొవ్యాక్స్' కార్యక్రమాన్ని డబ్ల్యూహెచ్‌ఓ చేపట్టింది. ఈ కార్యక్రమంలో భారత్‌ను భాగస్వామిగా చేర్చుకునేందుకు డబ్ల్యూహెచ్‌ఓ ఇప్పటికే చర్చలు జరుపుతుంది.
ఇక కరోనా వైరస్ 2019 డిసెంబర్‌లో చైనాలో మొదటి కేసు గుర్తించగా క్రమంగా అది ప్రపంచ దేశాలను చుట్టేసింది. ఇప్పటివరుకు ప్రపంచ వ్యాప్తంగా 27.19 మిలియన్ల ప్రజలు కరోనా బారిన పడ్డారు.. అటు భారత్ లో కుడా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం దేశంలో 42,80,423 కేసులు నమోదయ్యాయి. ఇందులో యాక్టివ్ కేసులు 8,83,697 ఉండగా, 33,23,950 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 72,775 మంది కరోనా వ్యాధితో మరణించారు.