ఫైజర్ వ్యాక్సిన్‌ను అత్యవసరంగా వినియోగించేందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనుమతి ఇచ్చింది. దీంతో మరిన్ని దేశాలు ఈ టీకాను వినియోగించేందుకు మార్గం సుగమమైంది. యునిసెఫ్ ద్వారా ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అత్యవసర వినియోగానికి పర్మిషన్ పొందిన మొదటి వ్యాక్సిన్ ఇదేనని WHO ప్రకటించింది.