WHO: కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు

WHO: ఒమిక్రాన్ వేరియంట్ చివరి కాదు..మరిన్ని వేరియంట్లు పుట్టుకురావచ్చు

Update: 2022-02-10 09:53 GMT

కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు

WHO: కరోనాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చివరిది కాదని మరింత ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కొత్త వేరియంట్లను వైల్డ్ కార్డు ఎంట్రీగా అభివర్ణించారు డబ్ల్యూహెచ్‌వో సాంకేతిక విభాగాతిపతి మరియా వాన్ కెర్ఖోవ్. అంతకుముందున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ-1 కన్నా తాజాగా బయటపడిన ఉప వేరియంట్ బీఏ-2 మరింత వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలిపారు. ఇప్పటికే ఒమైక్రాన్ వచ్చిన వారికి ఈ ఉప వేరియంట్ సోకుతుందా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదన్నారు. 

Tags:    

Similar News