జెలెన్‌స్కీ గ్రీన్ టీషర్ట్‌పై ఆసక్తికర చర్చ
Volodymyr Zelensky: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు వారాలుగా కొనసాగుతోంది.
Volodymyr Zelensky: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మూడు వారాలుగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ సైన్యం కూడా దీటుగా పోరాడుతోంది. రష్యా సైన్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. సైన్యానికి అండగా దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ నిలిచారు. ఉక్రెయిన్‌కు మద్ధతును కూడగట్టేందుకు తన ప్రసంగాలతో యత్నించారు. అందుకు అగుణంగా రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అయితే జెలెన్‌స్కీ కనిపించిన ఏ వీడియో చూసినా.. ఆలీవ్ గ్రీన్ టీషర్ట్ ధరించే కనబడుతున్నాడు. దీంతో అందరిలోనూ ఇప్పుడు జెలెన్‌స్కీ అదే రంగు టీషర్ట్‌ను ఎందుకు ధరిస్తున్నారన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యకు దిగింది. నాటి నుంచి యుద్ధాన్ని ఆపాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వీడియో సందేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. అయితే అప్పటి నుంచీ జెలెన్‌స్కీ మాత్రం ఆలీవ్ గ్రీన్ టీషర్టులోనే కనిపిస్తున్నారు. అయితే 2019 ముందు వరకు జెలెన్‌స్కీ నటుడు. అయితే ఇప్పుడు ఆయన దేశానికి అధ్యక్షుడు యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టి సైనికులు పోరాడుతున్నారు. నేపథ్యంలో వారికి సంఘీభావంగానే రక్షణకు చిహ్నంగా భావించే ఆలీవ్ గ్రీన్ టీషర్ట్‌నే జెలెన్‌స్కీ ధరిస్తున్నారు. వివిధ దేశాల అధ్యక్షులతో మాట్లాడే సమయంలోనూ అదే రంగు టీ-షర్టులో కనిపిస్తున్నారు.
ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం అత్యంత ఖరీదైన షూట్‌ను ధరిస్తున్నారు. ఇటీవల క్రిమియా వీలిన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మూడున్నర లక్షల రూపాయల విలువైన జాకెట్‌ను పుతిన్ ధరించారు. ఈ జాకెట్‌ను ఇటలీకి చెందిన ప్రముఖ డిజైనింగ్ కంపెనీ లోరోపైనా డిజైన్ చేసింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధం నేపథ్యంలో ఇరు దేశాధినేతల డ్రెస్సింగ్ తీరుపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈ యుద్ధంలో రష్యా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ యుద్ధాన్ని కొనసాగిస్తున్న జెలెన్‌స్కీ హీరోగా మారారు.