UK Next PM: ఆసక్తికరంగా బ్రిటన్‌ రాజకీయాలు.. బ్రిటన్‌ ప్రధాని రేసులో కీలక నేతలు

UK Next PM: లిజ్‌ ట్రస్‌ రాజీనామాతో రాజకీయ సంక్షోభం

Update: 2022-10-21 14:30 GMT

UK Next PM: ఆసక్తికరంగా బ్రిటన్‌ రాజకీయాలు.. బ్రిటన్‌ ప్రధాని రేసులో కీలక నేతలు

UK Next PM: ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేయడంతో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. లిజ్‌ తరువాత తదుపరి ప్రధాని ఎవరంటూ చర్చ మొదలైంది. రేసులో ప్రధానంగా ఐదుగురు పోటీ పడుతున్నారు. వారందరిలో భారత సంతతికి చెందిన, మాజీ మంత్రి రిషి సునక్ ముందు వరుసలో ఉన్నారు. రిషితో పాటు ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి జెరమీ హంట్‌, టోరీ ఎంపీలు పెన్నీ మోర్డాంట్‌, బెన్‌ వాలెస్‌, ప్రతిపక్ష నేత, లేబర్‌ పార్టీ నాయకుడు కైర్‌ స్టామర్‌ బరిలో ఉన్నారు.

వీరితోపాటు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా రేసులో ఉన్నానంటూ సంకేతాలు ఇస్తున్నారు. అయితే ఎవరిని అదృష్టం వరిస్తుందోనని బ్రిటన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. పన్నుల తగ్గింపు అభివృద్ధి ఈ రెండు హామీలతో టోరీ నేత ఎన్నికల్లో రిషి సునక్‌పై లిజ్‌ ట్రస్‌ పైచేయి సాధించారు. అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన రిషి ఇప్పటికీ ఆయనే ప్రధాని పదవికి ఫేవరేట్‌గా ఉన్నారు. రిషికే అవకాశాలు అధికంగా ఉన్నాయని యూకే బెట్టింగ్‌ సంస్థలు చెబుతున్నాయి.

Tags:    

Similar News