పాలస్తీనాకు అనుకూలంగా హర్వర్డ్ యూనివర్శిటీలో గళమెత్తిన శ్రుతికుమార్ ఎవరు ?

“విద్యార్థులు మాట్లాడారు. అధ్యాపకులు మాట్లాడారు. హార్వర్డ్, మీరు మా మాట వింటారా?" అంటూ ఇండియన్ అమెరికన్ విద్యార్ధి శ్రుతికుమార్ చేసిన ప్రసంగం హార్వర్డ్ యూనివర్శిటీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది.

Update: 2024-05-27 13:40 GMT

పాలస్తీనాకు అనుకూలంగా హర్వర్డ్ యూనివర్శిటీలో గళమెత్తిన శ్రుతికుమార్ ఎవరు ?

“విద్యార్థులు మాట్లాడారు. అధ్యాపకులు మాట్లాడారు. హార్వర్డ్, మీరు మా మాట వింటారా?" అంటూ ఇండియన్ అమెరికన్ విద్యార్ధి శ్రుతికుమార్ చేసిన ప్రసంగం హార్వర్డ్ యూనివర్శిటీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. అమెరికాలోని ప్రఖ్యాత హార్డర్ యూనివర్శిటీలో పాలస్తీనాకు అనుకూలంగా నిరసన చేసినవారికి మద్దతు పలికారు. నిరసనల్లో పాల్గొన్నందుకు 13 మంది సీనియర్లపై యూనివర్శిటీ ఆంక్షలు విధించడంపై మండిపడ్డారు.

అమెరికా హర్వర్డ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ లో మాట్లాడే అవకాశం దక్కిన ముగ్గురు విద్యార్ధుల్లో శ్రుతికుమార్ ఒకరు. ది పవర్ ఆఫ్ నాట్ నోయింగ్ పేరుతో శ్రుతికుమార్ మాట్లాడారు. "నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నప్పుడు, నా తోటివారిని గుర్తు చేసుకోవాలనుకుంటున్నానని పాలస్తీనా అనుకూల ఆందోళనలు నిర్వహించినందుకు నిషేధానికి గురైన 13 విద్యార్ధుల గురించి ఆమె ప్రస్తావించారు. క్యాంపస్ లో భావ ప్రకటనా స్వేచ్ఛ, నిరసన కూడా తెలపకుండా అడ్డుకోవడంపై నేను తీవ్ర నిరాశకు గురయ్యానంటూ ఆమె చేసిన ప్రసంగానికి ముగ్దులైన ప్రేక్షకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో భావోద్వేగానికి గురయ్యారు. మే 22న గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జరిగింది.

ఎవరీ శ్రుతికుమార్

శ్రుతికుమార్ పేరేంట్స్ భారత సంతతికి చెందినవారు. ఇండియా నుండి వలస వెళ్లిన శ్రుతికుమార్ పేరేంట్స్ అమెరికాలో స్థిరపడ్డారు. నెబ్రెస్కాలో ఆమె బాల్యం గడిచిపోయింది. గ్రాడ్యుయేషన్ చేసినవారిలో తమ కుటుంబంలో తానే మొదటి వ్యక్తి అని ఆమె చెప్పుకున్నారు. 2020లో కరోనా సమయంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ఆమె అడుగు పెట్టారు. విద్యతో పాటు సామాజిక అంశాలపై ఆమె స్పందిస్తుంటారు. హైస్కూల్ నుండే ఆమెకు పబ్లిక్ హెల్త్ పై ఆసక్తి ఉంది. గ్రాడ్యుయేషన్ తర్వాత పబ్లిక్ హెల్త్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ పై పనిచేయాలని భావిస్తున్నారు.

హైస్కూల్ ఉపన్యాస పోటీల్లో టాప్

హైస్కూల్ స్థాయిలో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో శ్రుతికుమార్ జాతీయ స్థాయిలో టాప్ 5 లో నిలిచారు. 2019లో నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో 250 మందికి పైగా పాల్గొన్నారు. అయితే ఇందులో టాప్ 5 లో శ్రతికుమార్ నిలిచారు. 13 రౌండ్లలో ఈ పోటీలు నిర్వహించారు. హైస్కూల్ చివరి సంవత్సరం 2019-20 లో వాయిస్ ఆఫ్ డెమాక్రసీ నేషనల్ కాంపిటీషన్ లో ఆమె ఫస్ట్ ఫ్రైజ్ గెలుచుకున్నారు. ఈ పోటీలో గెలవడం ద్వారా 30 వేల డాలర్ల కాలేజీ స్కాలర్ షిప్ ను ఆమె పొందారు.

Tags:    

Similar News