WHO Warns on COVID-19 Pandemic: ఇప్పట్లో కరోనా అంతం కాదు.. డబ్ల్యూహెచ్ఓ కీలక వాఖ్యలు

WHO Warns on COVID-19 Pandemic: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది

Update: 2020-07-01 09:30 GMT

WHO Warning on COVID-19 Pandemic: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది.. కరోనా కి ఇప్పట్లో అంతం లేదు అంటూ డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్‌ అద్నామ్‌ గెబ్రియేసిస్‌ అన్నారు. ఇప్పటికే కరోనా విజృంభణ మొదలై అరు నెలలు అవుతున్న పూర్తి అవ్వడంతో మరికొన్ని నెలల పాటు ఎదురు చూడక తప్పదు అని ఆయన వాఖ్యనించారు.

"ఈ కరోనా వైరస్ అంతం త్వరలోనే ఉండాలని మనము కోరుకుందాం.. ప్రస్తుతం మనం ఏప్పటిలాగే జీవనాన్ని కొనసాగిస్తున్నాం.. కానీ కరోనా ఇప్పట్లో అంతం కాదు. ఇంకో వాస్తవం ఏంటంటే కరోనా మనం ముగింపునకు కూడా దగ్గర్లో లేమని ఆయన చెప్పుకొచ్చారు. రానున్న రోజుల్లో మనం ఈ కరోనా తో సహా జీవనం చేయాల్సిందేనని, అయితే అది ఎలా అన్నది మాత్రం ఆయా దేశాలు నిర్ణయించుకోవాలని ఆయన అన్నారు."

ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అన్ని దేశాలను పట్టి పీడిస్తుంది. కరోనా కేసులు మాత్రమే కాదు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య కోటికి యాబై లక్షలకు పైగానే ఉంది. కరోనా కేసులు ఎక్కువగా అమెరికా,బ్రెజిల్‌,రష్యా, భారత్, బ్రిటన్ లలో నమోదు అవుతున్నాయి.

ఇక భారత్ లో కరోనా కేసుల లెక్కలు ఒక్కసారిగా చూసుకుంటే.. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 18,653 కేసులు నమోదు కాగా, 507 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 5,85,493 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,20,114 ఉండగా, 3,47,979 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 17,400 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,17,931 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 88,26,585 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు

Tags:    

Similar News