కరోనా ఆనవాళ్లు కనుగొనే పనిలో WHO శాస్త్రవేత్తలు

చైనాలోని బైషాజూ మార్కెట్లో పర్యటిస్తున్న WHO బృందం

Update: 2021-01-31 15:25 GMT

WHO 

కరోనా మిస్టరీని చేధించేందుకు WHO చైనాలో పర్యటిస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తికి కారణమైన వుహాన్‌ అడవి జంతువుల మార్కెట్లో కరోనా మూలాలను కనుగొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. చైనా అధికారులు, పోలీసులు వెంట రాగా.. బైషాజూ మార్కెట్లో కరోనా పుట్టుక సంబంధించి ఆధారాలను వెలితీసే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. వెటర్నరీ, వైరాలజీ, ఆహార భద్రత, ఎపిడెమియాలజీ రంగాల్లోని నిపుణులు ఈ బృందంలో ఉన్నారు. ఇప్పటికే వారు వూహాన్ నగరంలోని రెండు కీలక ఆస్పత్రులను సందర్శించింది WHO బృందం. అయితే.. ఒక్కసారి పర్యటనలో శాస్త్రవేత్తలు కరోనా గుట్టు విప్పగలరా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

Tags:    

Similar News