మంకీపాక్స్ ప్రమాద ఘంటికలు.. గే శృంగారంతోనే ప్రస్తుత మంకీపాక్స్ వ్యాప్తి..
Monkeypox: మంకీపాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
Monkeypox: మంకీపాక్స్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ ఆరోగ్య అత్యయిక పరిస్థితిని ప్రకటించింది. డబ్ల్యూహెచ్‌వో ప్రకటించి వారం కూడా గడవకముందే తొలిసారి ఆఫ్రికా బయట మంకీపాక్స్ మరణాలు నమోదవుతున్నాయి. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్‌లో 41 ఏళ్ల వ్యక్తి, స్పెయిన్‌లో మరో వ్యక్తి మంకీపాక్స్‌తో మృతి చెందినట్టు నిర్ధారించారు. ఇన్నాళ్లు ఆఫ్రికా ఖండానికే పరిమితమైన మరణాలు ఇప్పుడు ఇతర ప్రాంతాల్లోనూ నమోదవుతున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలయ్యింది.
బ్రెజిల్‌లోని మినాస్ గెరాయిస్ రాష్ట్ర రాజధాని బెలో హోరిజోంటేకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఐరోపాకు వెళ్లి వచ్చాడు. జూన్ 10వ తేదీన మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. వైరస్ నిర్ధారణ కావడంతో బ్రెజిల్‌లో తొలి కేసు నమోదు అయ్యింది. సావో పాలో, రియో డీ జనెరియోలో వెయ్యికి పైగా కేసులు నమోదయ్యాయి. అయితే అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ వ్యక్తికి తాజాగా మంకీపాక్స్ సోకింది. అతడికి ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ కోలుకోలేకపోయాడు. చివరికి 41 ఏళ్ల ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఐరోపాలోనూ తొలి కేసు నమోదయ్యింది. స్పెయిన్‌లోనూ ఓ వ్యక్తికి వైరస్ బారినపడి మృతి చెందాడు. స్పెయిన్‌లో మంకీపాక్స్ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశంలో 4వేల 298 మందికి వైరస్ సోకినట్టు అక్కడి వైద్యాధికారులు తెలిపారు. ఆఫ్రికా దేశాల్లో మంకీపాక్స్ సర్వసాధారణమైన వ్యాధి. అక్కడ మంకీపాక్స్ మరణాలు ఇప్పటివరకు 5 నమోదయ్యాయి. అయితే ఆప్రికా బయట మరణాలు నమోదవడం ఇదే తొలిసారి.
ఆప్రికాలో వైరస్‌కు ప్రస్తుతం విజృంభిస్తున్న మంకీపాక్స్ తీవ్రతలో తేడా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా గే శృంగారంతోనే మంకీపాక్స్ మొదలైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్‌వో ప్రకారం మంకీపాక్స్ ఇంతకాలం ఆఫ్రికాకే పరిమితమైన వైరస్. కానీ, ఈ మధ్య బయటి దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఇప్పటిదాకా 78 దేశాల్లో 18వేలకు పైగా మంకీపాక్స్ కేసులు వెలుగు చూశాయి. 70 శాతం యూరప్ దేశాల్లో, 25 శాతం అమెరికాలో బయటపడ్డాయి. ఇప్పటిదాకా నమోదైన కేసుల్లో ఎక్కువ శాతం లైంగిక ధోరణి వల్లే నమోదైనట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంతేకాకుండా వేగంగా వైరస్ విస్తరిస్తుండడంతో ఆందోళన చెందిన WHO.. ఇటీవల అంతర్జాతీయ అత్యయిక పరిస్థితి ప్రకటించింది. దీంతో ఆయా దేశాలు మంకీపాక్స్‌పై అప్రమత్తమై నివారణ చర్యలకు శ్రీకారం చుడుతాయి. అంతేకాకుండా సెక్స్ పార్ట్‌నర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటూ WHO హెచ్చరించింది.
మంకీపాక్స్ బాధితులకు సన్నిహింతంగా మెలిగిన వారు 21 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని బ్రిటిష్ ఆరోగ్య రక్షణ సంస్థ సూచించింది. మంకీపాక్స్ ఎవరికైనా సోకవచ్చని గట్టిగా తుమ్మినా, దగ్గినా తుంపర్ల ద్వారా మంకీపాక్స్ ఒకరి నుంచి మరొకరిని వ్యాపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి బారినపడిన వారికి అత్యంత సన్నిహితంగా వెళ్లినవారికే సోకుతుందని వివరిస్తున్నారు. అలాగే లైంగిక క్రియ ద్వారా కూడా సోకుతున్నట్టు తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. స్పెయిన్, బెల్జియంలో స్వలింగ, ద్విలింగ సంపర్కుల్లో మంకీపాక్స్ వెలుగు నిర్ధారణ అయింది. బ్రిటన్‌లో వెలుగుచూసిన కేసుల్లో ఎక్కువ భాగం స్వలింగ సంపర్కుల్లోనే కనిపించడం గమనార్హం. మంకీపాక్స్ సోకిన వారితో లైంగికంగా కలిసినా.. ఇతరత్రా దగ్గరకు వెళ్లినా వైరస్ సోకనున్నది. వైరస్ సోకిన వారు దీర్ఘకాలికంగా వ్యాధుల బారిన పడినవారికి, గర్భిణులకు, 12 ఏళ్లలోపు చిన్నారులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
మంకీపాక్స్ తొలికేసును 1950లో గుర్తించారు. పరిశోధనల నిమిత్తం కోతులపై ప్రయోగాలు చేస్తున్న క్రమంలో ఈ వైరస్ బయటపడింది. అయితే మనుషుల్లో మాత్రం 1970లో కాంగోలో గుర్తించారు. దీన్ని మినీపాక్స్ వైరస్ పిలుస్తారు. ఇది ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. మంకీపాక్స్ ప్రధానంగా ముఖం ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆఫ్రికా ఖండంలో నమోదైన వేలాది మంకీపాక్స్ కేసులు చాలావరకు అపరిశుభ్రత, జంతువుల ద్వారానే వ్యాపించింది. శారీరక కలయిత ద్వారా వ్యాపించిన కేసులు చాలా తక్కువ. ఈ వ్యాధి సోకిన వారికి జ్వరం, ముఖంపై దద్దుర్లు, ఒళ్లనొప్పులతో ప్రారంభమవుతుంది. ఈ లక్షణాలు 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. ఈ వ్యాధి సోకిన వారిలో ఆఫ్రికాలో తప్ప.. ఇతర దేశాల్లో గతంలో ఎవరూ మృతి చెందలేదు. బ్రెజిల్, స్పెయిన్‌లో మరణాలు నమోదవడంతో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వైరస్ బారిన పడిన వారు ఇతరులకు దూరంగా, సాధారణ ఫ్లూ కోసం తీసుకునే జాగ్రత్తలనే తీసుకుంటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
మన దేశంలోనూ మంకీపాక్స్ కేసులు నమోదవుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై.. కేసులపై అప్రమత్తం చేసింది. లక్షణాలు కనిపిస్తే.. తక్షణమే స్పందించి.. చర్యలు చేపట్టాలని సూచించింది.