US Elections 2024: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‎ ఏపీ అల్లుడే

US Elections 2024: అమెరికాలో రిపబ్లికన్ పార్టీ తరపున ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరు ఖరారు అయ్యింది. ఆయన సతీమణి భారత సంతతికి చెంది వ్యక్తి కావడం గమనార్హం. ఆమె పేరు ఉషా చిలుకూరి. రాజకీయాల్లో తన భర్తకు అండగా ఉన్న ఉష గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

Update: 2024-07-16 06:59 GMT

US Elections 2024: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి జేడీ వాన్స్‎ ఏపీ అల్లుడే

US Elections 2024:రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారు అయిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. ఆయన ఒహాయో రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ సెనేటర్. అయితే మరో ప్రత్యేక విషయం ఏంటంటే వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన వ్యక్తి. ముఖ్యంగా తెలుగు సంతతి వ్యక్తి కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి.

ఉషా చిలుకూరి వాన్స్ తల్లిదండ్రులు చాలా ఏండ్ల క్రితం ఏపీ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి జన్మించారు. ఆమె న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలు. 2015 నుంచి న్యాయ సేవల సంస్థలు ముంగర్, టోల్స్, ఓస్లాన్ లో కార్పొరేట్ లిటిగేటర్ గా పరిచేస్తున్నారు.అంతకుముందు 2013లో యేల్ యూనివర్సిటీలో లా చేస్తున్న సమయంలో ఉషాకు జేడీ వాన్స్ పరిచయమచ్యారు.వారి పరిచయం ప్రేమగా మారడంతో..2014లో కెంటకీలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక్, కుమార్తే మిరాబెల్.

ఉషా చిలుకూరి రాజకీయాల్లో మొదట్నుంచీ భర్తకు అండగా నిలుస్తున్నారు. రెండేళ్ల క్రితం ఒహాయో సెనేటర్ గా జేడీ వాన్స్ పోటీ చేసిన సమయంలోనూ ఆయన తరపున ఎన్నికల ప్రచారంలో కీలక బాధ్యతలను నిర్వహించారు. ఆ ఎన్నికల్లో గెలిచిన వాన్స్ మొదటిసారిగా అమెరికా సెనేట్ కు ఎన్నికయ్యారు. వాస్తవానికి లా కోర్సు పూర్తి చేసిన తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్ చేసేటప్పుడు ఉషా చిలుకూరి డెమొక్రటిక్ పార్టీ సభ్యురాలిగా ఉన్నారు. అప్పట్లో ఆమె లెఫ్ట్ వింట్, లిబరల్ గ్రూప్స్ తో కలిసి పనిచేయగా..వివాహం తర్వాత ఉషా పార్టీ మారారు. భర్త జేడీ వాన్స్ సలహామేరకు రిపబ్లికన్ పార్టీలో చేరారు.

Tags:    

Similar News