Mpox Vaccine: మంకీపాక్స్ టీకాకు WHO అనుమతి
Mpox Vaccine: మంకీపాక్స్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది.
Mpox Vaccine: మంకీపాక్స్ నివారణకు రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి ఇచ్చింది. ప్రపంచ దేశాలను ప్రాణాంతక మంకీపాక్స్ భయాందోళనకు గురి చేస్తుంది. ఆప్రికాతో పాటు వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న వ్యాధిపై పోరాటంలో కీలక అడుగు వేసినట్టు WHO పేర్కొన్నది.
మంకీపాక్స్ నివారించేందుకు బవేరియన్ నార్డిక్ సంస్థ టీకాను అభివృద్ధి చేసింది. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ రివ్యూ చేసింది. ఈ వ్యాక్సిన్‌ను అలయన్స్ గావీతోపాటు యూనిసెఫ్ వంటి సంస్థలు కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ప్రస్తుతం వీటి ఉత్పత్తి పరిమిత సంఖ్యలో జరుగుతోంది. నాలుగు వారాల వ్యవధిలో రెండు డోసుల్లో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే ఈ టీకా ఇవ్వవచ్చని WHOవెల్లడించింది. ఒక్క డోస్ వేసినప్పుడు టీకా 76 శాతం, రెండు డోసులు వేసినప్పుడు 82 శాతం ప్రభావాన్ని చూపినట్టు తేలింది.