రష్యా సైన్యం పోరాటాన్ని ప్రశంసించిన పుతిన్‌.. యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధమన్న ఉక్రెయిన్‌..

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా సైన్యంపై పుతిన్ ప్రశంసలు కురిపించారు.

Update: 2022-02-27 10:45 GMT

రష్యా సైన్యం పోరాటాన్ని ప్రశంసించిన పుతిన్‌.. యుద్ధాన్ని ఆపేయడానికి సిద్ధమన్న ఉక్రెయిన్‌..

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో పోరాడుతున్న రష్యా సైన్యంపై పుతిన్ ప్రశంసలు కురిపించారు. తమ సైన్యం విరోచితంగా పోరాడుతున్నట్టు పుతిన్‌ తెలిపారు. డాన్‌బాస్‌ ప్రజల స్వతంత్రం కోసం ప్రత్యేక ఆపరేషన్‌లో వీరోచితంగా పోరాడుతున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్‌తో చర్చలు తాము సిద్ధమని రష్యా అధ్యక్షుడు తెలిపారు. చర్చలకు రష్యా బృందం బెలారస్‌లోని గోమెల్‌ నగరానికి చేరుకున్నట్టు క్రెమ్లిన్‌ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించి శాంతి స్థాపనకు సిద్ధంగా ఉన్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు. అయితే బెలారస్‌ రష్యా అనుకూల దేశమని అక్కడ చర్చలకు రాలేమని తేల్చిచెప్పారు. మరో ప్రాంతంలో చర్చలు నిర్వహించాలని జెలెన్‌స్కీ కోరారు. రష్యాలోని వార్సావ్‌, బ్రటిస్లావా, లేదంటే హంగేరి రాజధాని బుడాఫెస్ట్‌, టర్కీలోని ఇస్తాంబుల్‌, అజార్‌బైజాన్‌ రాజధాని బాకులో చర్చలకు వేదికలను నిర్ణయించాలని రష్యాకు జెలెన్‌స్కీ సూచించారు.

ఒకవైపు చర్చలు అంటూనే రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని నగరాలపై విరుచుకుపడుతోంది. తాజాగా రెండు నగరాలు సొంతమైనట్టు రష్యా ప్రకటించింది. మరోవైపు పలు ప్రాంతాల్లో రష్యా సైన్యాన్ని ఉక్రెయిన్‌ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. కీవ్‌లో రష్యా సైన్యంపై ఉక్రెయిన్‌ దళాలు ఎదుర్కొంటున్నాయి. రష్యన్‌ వాహనాలను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్‌ తెలిపింది. నివాస ప్రాంతాలు, స్కూళ్లు, అంబులెన్స్‌లపైనా రష్యా సైన్యం దాడి చేస్తున్నట్టు ఉక్రెయిన్‌ తెలిపింది. సైన్యం విరోచితంగా పోరాడుతున్నట్టు ఉక్రెయిన్‌ ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Tags:    

Similar News