మరో నాలుగేళ్ళు మనమే.. ట్రంప్ ధీమా!

Donald Trump speaks : అమెరికా అధ్యక్ష ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా కరోనా నుంచి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు.

Update: 2020-10-18 08:45 GMT

Donald Trump speaks : అమెరికా అధ్యక్ష ఎన్నికలకి సమయం దగ్గర పడుతున్న సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా కరోనా నుంచి కోలుకున్న డోనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు. శనివారం మిచిగాన్ ఎన్నికల ర్యాలిలో పాల్గొన్న ట్రంప్ అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ అధికారంలోకి రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో లాగానే ప్రజలు ఎప్పుడు రిపబ్లికన్‌ పార్టీని గెలిపించాలని ట్రంప్ కోరారు. తాజాగా జరగబోయే ఎన్నికలు చాలా కీలకమని అన్నారు. అమెరికా ప్రజలకు అధికారం ఇచ్చేలా రిపబ్లికన్‌ పార్టీ పనిచేస్తుందని ట్రంప్ అన్నారు. దీంతో అక్కడి వారు మరో నాలుగేళ్లు.. మరో నాలుగేళ్లు అంటూ నినాదాలు చేశారు.

ఇక అధ్యక్ష పదవికి డొనాల్డ్‌ ట్రంప్‌ తో పాటుగా బైడెన్‌ పోటి పడుతున్న సంగతి తెలిసిందే.. అయితే వీరిద్దరి మధ్య అక్టోబర్‌ 15న జరగాల్సిన రెండో ముఖాముఖి రద్దయింది. ట్రంప్‌నకు కరోనా సోకడంతో ఇది రద్దయింది. అయితే ఈ డిబేట్ కమిషన్‌ ముఖాముఖిని వర్చువల్‌గా నిర్వహించాలని నిర్ణయించింది. అయితే ట్రంప్‌ దీనిని వ్యతిరేకించడంతో ఆ డిబేట్‌ను రద్దు చేశారు. వచ్చే వారంలో బెల్మాంట్ యూనివర్సిటీలో ఈ ఇద్దరు భేటి కానున్నారు. అటు అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి. అటు 69 ఏళ్ల ట్రంప్ 2016 అమెరికా అధ్యక్ష్య ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.

Tags:    

Similar News